ప్రీమియర్స్ తో 'దీవానా' పర్ఫెక్ట్ ప్లాన్
సెన్సార్ బోర్డ్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా క్లీన్ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్ కు గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ అండగా నిలవడం ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.
సినిమా ఇండస్ట్రీలో సినిమాల ఫేట్ ఎలా ఉండబోతోంది అనేది డిసైడ్ అవ్వడానికి ఒక్క ఫ్రై డే చాలు. కంటెంట్ బాగుంటే జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ వేరు. ఇక మేకర్స్ నమ్మకంతో కొన్నిసార్లు రిలీజ్ డేట్ కంటే ముందు రోజే ప్రీమియర్స్ వేయడం చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఒక స్వచ్ఛమైన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తున్న దీవానా సినిమా టీమ్ కూడా అదే స్ట్రాటజీతో ముందుకొచ్చింది. తమ సినిమాను రెగ్యులర్ ప్యాటర్న్ లో శుక్రవారం కాకుండా శనివారం అనగా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
డైరెక్ట్ గా శనివారం రిలీజ్ చేస్తున్నా జూన్ 19వ తేదీ శుక్రవారం నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని డిసైడ్ అయ్యారు. తాము నమ్ముకున్న కథ మీద, తాము తీసిన కంటెంట్ మీద పూర్తి కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఏ నిర్మాతలు ఇలాంటి సాహసం చేయరు. ముందుగానే ప్రీమియర్స్ ద్వారా సినిమా చూసిన ఆడియన్స్ నుంచి వచ్చే పాజిటివ్ మౌత్ టాక్ శనివారం రిలీజ్ కు చాలా హెల్ప్ అవుతుందనేది మేకర్స్ అసలు ప్లాన్ గా తెలుస్తోంది.
హర్షిత్ రెడ్డి, స్మేహా మనిమెగలై జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. మున్నా, అమ్ము పాత్రల మధ్య నడిచే ఒక క్యూట్ ఎమోషనల్ వన్ సైడ్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. ఒక యువకుడు తన ప్రేయసి ప్రేమను పొందడానికి పడే ఆరాటం, ఆ ప్రాసెస్ లో వాళ్ళిద్దరి మధ్య వచ్చే మానసిక సంఘర్షణ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అని సెన్సార్ రిపోర్ట్స్ ద్వారా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.
సెన్సార్ బోర్డ్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా క్లీన్ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్ కు గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ అండగా నిలవడం ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అల్లు అరవింద్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే అందులో కచ్చితంగా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని ప్రేక్షకుల్లో ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రీమియర్స్, శనివారం రిలీజ్ స్ట్రాటజీ వెనుక కూడా అదే టీమ్ ప్లానింగ్ ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
శుక్రవారం నాడు పెయిడ్ ప్రీమియర్స్ వేసి కంటెంట్ ను ముందే జనాల్లోకి వదలడం ద్వారా సోషల్ మీడియాలో సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుంది. ఆ మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే శని, ఆదివారాల్లో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టే ఛాన్స్ ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా వీకెండ్ ను పర్ఫెక్ట్ గా వాడుకోవడానికి దీవానా టీమ్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయితే టాలీవుడ్ లో ఇలాంటి చిన్న సినిమాలకు ఇదొక కొత్త బూస్ట్ ఇస్తుంది.
అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్స్ పై వాసుదేవ్ కొప్నినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాపై టీమ్ అంతా చాలా నమ్మకంతో ఉన్నారు. శుక్రవారం పడే ప్రీమియర్ షోల రిజల్ట్ ఎలా ఉంటుందో, ఆ మరుసటి రోజు శనివారం నాడు బాక్సాఫీస్ దగ్గర ఈ దీవానా లవ్ స్టోరీ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే జూన్ 20వ తేదీ వరకు ఆగాల్సిందే.