ఎట్టకేలకు కూతుర్ని పరిచయం చేసిన దీపిక - రన్వీర్... ఎంత క్యూట్ గా వుందో!

దీపావళి పండుగను పురస్కరించుకొని.. తమ కూతురు దువాతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.;

Update: 2025-10-22 04:34 GMT

సాధారణంగా సెలబ్రిటీలు తమ వారసులను అభిమానులకు చూపించడానికి సంశయిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా వారి ఫోటోలను షేర్ చేయరు. కొంతమంది షేర్ చేసినా...ఆ ఫోటోలను కొంతకాలానికి డిలీట్ చేస్తూ ఉంటారు. దీంతో తమ అభిమాన నటీనటుల పిల్లలను చూడడానికి అభిమానులు తెగ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపిక పదుకొనే - రణవీర్ సింగ్ తమ కూతురిని ఇంతవరకు చూపించకపోయేసరికి ఎప్పుడెప్పుడు చూపిస్తారా? అని అభిమానులు ఎంతగా ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఎట్టకేలకు తమ కూతురు 'దువా' ను దీపావళి సందర్భంగా అభిమానులకు పరిచయం చేసింది ఈ జంట.

 

దీపావళి పండుగను పురస్కరించుకొని.. తమ కూతురు దువాతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్స్ దువా క్యూట్ నెస్ కి ఫిదా అయిపోతున్నారని చెప్పవచ్చు. అప్పుడే ఇంత పెద్దగా అయ్యిందా అంటూ ఒకింత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది అభిమానులకు దీపావళి సందర్భంగా మీరు ఇచ్చిన ది బెస్ట్ గిఫ్ట్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అచ్చం మహాలక్ష్మి లా ఉందని కొంతమంది కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది తల్లిదండ్రులకు మించిన అందంతో మరింత క్యూట్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే దీపావళి సందర్భంగా తమ కూతురిని అభిమానులకు పరిచయం చేసి అందరికీ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది ఈ జంట

 

దీపికా పదుకొనే - రణవీర్ సింగ్ విషయానికొస్తే.. 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. ఇకపోతే వీరి పెళ్లి వేడుకలు సాంప్రదాయ మలయాళం పద్ధతిలో ఒకసారి.. కొంకణి పద్ధతిలో మరొకసారి వేడుక జరిగింది. ఈ వివాహానికి ముందు దాదాపు ఆరు సంవత్సరాల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట .. ఎట్టకేలకు 2018లో ఒక్కటయ్యారు. ఇక పెళ్లయితే చేసుకున్నారు కానీ కెరియర్ పై ఫోకస్ పెట్టడం వల్ల తమ మొదటిబిడ్డను తమ లైఫ్ లోకి ఆహ్వానించలేదు. దీంతో ఎన్నో రూమర్స్ ఎదుర్కొన్న ఈ జంట ఎట్టకేలకు గత ఏడాది సెప్టెంబర్ లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. .

 

ఇక దీపికా పదుకొనే కెరియర్ విషయానికొస్తే.. గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో విమర్శలు ఎదుర్కొంటుంది.. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా నుంచి ఈమెను తీసివేయడం, అలాగే కల్కి 2 నుంచి కూడా తీసి వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో చాలామంది ఈమెపై విమర్శలు గుప్పించారు. అలా ఒకవైపు ఇండస్ట్రీలో విమర్శలు ఎదుర్కొంటూనే.. మరొకవైపు పలు అరుదైన గౌరవాలను స్వీకరిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది దీపిక. ఇటీవల ఏఐ కి వాయిస్ అందించిన తొలి భారతీయ నటిగా కూడా పేరు దక్కించుకుంది.

Tags:    

Similar News