దీపికా పదుకొణే తప్పులు..ఎప్పటికీ అసంతృప్తిగానే!
ఏ రంగంలోకి ఎంటర్ అయినా ఆరంభంలో తప్పులు చేయడం సహజం. అలా తప్పు జరిగినప్పుడు పనిపై పర్పెక్షన్ వస్తుంది.;
ఏ రంగంలోకి ఎంటర్ అయినా ఆరంభంలో తప్పులు చేయడం సహజం. అలా తప్పు జరిగినప్పుడు పనిపై పర్పెక్షన్ వస్తుంది. మళ్లీ ఆ తప్పు పునరావృతం కాకుండా ఉంటుంది. ఇంకెంత ఉత్తమంగా పని చేయగలం అన్న ఆలోచన కలుగుతుంది. కట్టుబడి అలా పని చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఎంత పని చేసినా కొంత మందికి సంతృప్తి కలగదు. ఏదో వెలితి వెంటాడుతూనే ఉంటుంది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణే ఆ వర్గానికి చెందిన నటే అనే తెలుస్తోంది. గత: గతహా అనుకోకుండా పాత చిత్రాలను తలుచుకుని ఇప్పటికీ ఫీలవుతానంటోంది దీపిక.
తప్పులతో బాధ తప్పదు:
కథల ఎంపిక విషయంలో తాను చేసిన తప్పులు తనని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయంది. `ఓం శాంతి ఓం` నుంచి `కల్కి 2898` వరకూ ఎన్నో సినిమాల్లో నటించినా? వాటిలో చేసిన తప్పులు గుర్తొచ్చినప్పుడల్లా అసంతృప్తిగానే ఉంటానంది. తాను ఎంపిక చేసుకున్న ప్రతీ కథ విజయం కాలేదని... వాటి విషయంలో మరింత ఎక్కువగా బాధ పడతానంది. ఇంకొన్ని సార్లు తాను కేవలం డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పని చేసానని అనుకుంటారు. కానీ తన మనసులో అలాంటి భావన లేకుండా పనిచేసినా? అలాంటి సినిమాలు ఫెయిలైనా బాధ పడతానంది.
తనని నమ్మి అవకాశం ఇచ్చిన వారు నష్టాల్లో ఉండటం తాను చూడలేనంది. నటిగా తనకు ఇంత పరిణతి ఈ మద్య కాలంలో బాగా ఎక్కువైందని తెలిపింది. పది సంవత్సరాల తర్వాత కూడా తాను ఇలాగే ఉంటానేమో అంది. గతంలో వాటి గురించి పెద్దగా పట్టించుకునే దాన్ని కాదని..ఎదిగే కొద్ది నటిగా బాధ్యతతో పాటు, ఒత్తిడి కూడా పెరుగు తుందంది. ప్రస్తుతం దీపిక బాలీవుడ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
రెండు సినిమాలతో బిజీ:
షారుక్ ఖాన్ హీరోగా సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `కింగ్` లో నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న చిత్రంలోనూ నటిస్తోంది.ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రత్యేకించి బన్నీ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా విజయం అమ్మడికి కీలకమే. `కల్కి 2` నుంచి దీపికను తప్పించిన సంగతి తెలిసిందే. నిర్మాతలతో లొల్లి ఏంటి? అన్నది క్లారిటీ లేదు గానీ హీరోయిన్ గా ఎంపికైన తననే తప్పించారంటే? వివాదం పెద్దదే అయి ఉంటుం దని ప్రచారం జరిగింది. దీంతో దీపిక టాలీవుడ్ కు టార్గెట్ గా మారింది. తదుపరి తెలుగు నుంచి ఎలాంటి అవకాశాలు అందుకుంటుంది? అన్నది ఆసక్తికరమే. అయితే అప్పటికే బన్నీ సినిమా కోసం దీపిక కమిట్ అవ్వడం అన్నది కలిసొచ్చిన అంశంగా మారింది. లేదంటే? దీపిక మరింత టార్గెట్ అయ్యేది.