ఆ టైమ్ లో ఎంతో కష్టమనిపించింది
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో దీపికా తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి, తల్లిగా మారిన తర్వాత ప్రయాణం గురించి పలు విషయాలను షేర్ చేసుకుంది.;
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఎంత పెద్ద స్టార్ అనేది అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లోని తన సహనటుడు రణ్‌వీర్ సింగ్ ను 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపికా గతేడాది సెప్టెంబర్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రెగ్నెన్సీ టైమ్ లో కొన్నాళ్లు, పాప పుట్టిన తర్వాత కొన్నాళ్ల పాటూ సినిమాలకు దూరంగా ఉన్న దీపికా తిరిగి ఇప్పుడు షూటింగుల్లో పాల్గొనడానికి రెడీ అవుతోంది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో దీపికా తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి, తల్లిగా మారిన తర్వాత ప్రయాణం గురించి పలు విషయాలను షేర్ చేసుకుంది. కడుపుతో ఉన్నప్పుడు నెలలు నిండేకొద్దీ ఎంతో కష్టమనిపించినట్టు చెప్పిన దీపికా ఆ జర్నీలో ఎన్నో ఛాలెంజెస్‌ను ఎదుర్కొన్నట్టు తెలిపింది. మరీ ముఖ్యంగా నెలలు నిండిన తర్వాత ఎంతో కష్టంగా అనిపించిందని దీపికా వెల్లడించింది.
ఆ టైమ్ లో తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ తనతోనే ఉండటాన్ని అదృష్టంగా భావించానని చెప్తున్న దీపిక తన కూతురికి పేరు పెట్టే విషయంలో ఎంతో ఆలోచించానని, దాని కోసం ఎంతో రీసెర్చ్ చేశానని, చివరకు దువా అనే పేరుని డిసైడ్ చేసినట్టు దీపికా చెప్పుకొచ్చింది. దువా అంటే అర్థమేంటో తెలియక చాలామంది తనను అడిగారని కూడా దీపికా ఈ సందర్భంగా వెల్లడించింది.
దువా అనే పేరుకు అర్థం ప్రార్థన అని చెప్పిన దీపిక తల్లిగా ఓ వైపు కూతురి బాధ్యతల్ని చూసుకుంటూనే నటిగా షూటింగులకు హాజరవడం ఎప్పుడూ సవాలేనని, ప్రస్తుతం తాను మదర్‌హుడ్ ను ఎంజాయ్ చేస్తున్నానని, త్వరలోనే షూటింగుల్లో జాయిన్ అవుతానని చెప్పిన ఆమె, తన కూతురికి తల్లిగా ఉంటూనే షూటింగ్స్ లో పాల్గొంటానని చెప్పింది.
అయితే దీపికా ఈ మధ్యన కొత్త సినిమాలేమీ ఒప్పుకోలేదు. ఆమె నుంచి ఆఖరిగా సింగం అగైన్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో దీపిక ఎంతో పవర్‌ఫుల్ క్యారెక్టర్ లో కనిపించింది. దీంతో పాటూ గతేడాది ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898ఏడీ సినిమాలో కూడా దీపిక సుమతి అనే ఎంతో శక్తివంతమైన పాత్రలో నటించింది. ప్రస్తుతం కల్కి2 కు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి.