స్పిరిట్ గొడవ.. ఒక్క లైక్‌తోనే దీపిక ఏం చెప్పాలనుకుంది?

ఇటీవల నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా రెమ్యునరేషన్, 8 గంటల పని, లాభాల్లో 10 శాతం వాటా లాంటి విషయాలే ఇద్దరి మధ్య లెక్క కుదరకపోవడానికి కారణమని చెప్పారు.

Update: 2026-08-22 07:58 GMT

‘స్పిరిట్’ నుంచి దీపికా పదుకొణె తప్పుకున్న తర్వాత చాలా రకాల కారణాలు బయటకు వచ్చాయి. ఇటీవల నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా రెమ్యునరేషన్, 8 గంటల పని, లాభాల్లో 10 శాతం వాటా లాంటి విషయాలే ఇద్దరి మధ్య లెక్క కుదరకపోవడానికి కారణమని చెప్పారు. అప్పటినుంచి దీపిక ఏమైనా స్పందిస్తారా అన్న మాట నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆమె నేరుగా ఏమీ చెప్పకపోయినా ఒక పోస్ట్‌కు లైక్ చేయడం మాత్రం మరింత వైరల్ గా మారింది.

దీపిక గురించి వస్తున్న విమర్శలకు కౌంటర్‌గా ఓ జర్నలిస్ట్ చేసిన పోస్ట్‌కు ఆమె లైక్ చేశారు. హీరోలు ప్రాఫిట్ షేర్ అడిగితే పెద్దగా సమస్యగా చూడరు, కానీ ఒక హీరోయిన్ అదే అడిగితే ఎందుకు ఇంత రియాక్షన్ వస్తోందని ఆ పోస్ట్‌లో ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని మేల్ ఈగోతో కూడా లింక్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే దీపిక ప్రణయ్ కామెంట్స్‌లో ఒక్క పాయింట్‌కీ నేరుగా సమాధానం ఇవ్వలేదు.

10 శాతం వాటా నిజంగానే అడిగారా, షూటింగ్ టైమింగ్స్ విషయంలో ఏం జరిగింది, రెమ్యునరేషన్ దగ్గర ఎంత గ్యాప్ వచ్చింది అన్న వాటిపై ఆమె ఇప్పటికీ సైలెంట్‌గానే ఉన్నారు. కానీ తనకు సపోర్ట్‌గా వచ్చిన పోస్ట్‌కు లైక్ చేయడంతో ఆమె ఏ వైపు నిలుస్తున్నారో కొంత అర్థమవుతోందని సోషల్ మీడియాలో చాలామంది అంటున్నారు. మరోవైపు ఒక్క లైక్‌కే అంత అర్థం కట్టాల్సిన అవసరం లేదని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు.

కానీ ఈ వివాదం మధ్యలోనే, అదే 10 శాతం ప్రాఫిట్ షేర్ పాయింట్‌ను డిఫెండ్ చేసిన పోస్ట్‌కు దీపిక లైక్ చేయడం వల్ల అది నార్మల్ సోషల్ మీడియా యాక్టివిటీలా కూడా కనిపించడం లేదు. ఆమె అన్ని గమనిస్తూనే ఉందని అర్థమవుతుంది. అందుకే ఆమె మాటల్లో చెప్పకుండానే ఒక చిన్న కౌంటర్ ఇచ్చారా అన్న టాక్ మొదలైంది. ఇప్పటికే ‘స్పిరిట్’లో దీపిక స్థానంలో త్రిప్తి డిమ్రి వచ్చి చేరింది. షూటింగ్ కూడా ముందుకు వెళ్తోంది.

మరోవైపు ‘కల్కి 2’ నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. రెండు ప్రభాస్ సినిమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు ‘స్పిరిట్’పై నిర్మాతే బయటకు వచ్చి తన వెర్షన్ చెప్పడంతో దీపిక నుంచి కూడా ఏదో ఒక సమాధానం వస్తుందేమో అన్న ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఆమె చేసినది ఒక లైక్ మాత్రమే. కానీ అది కూడా తనపై వచ్చిన విమర్శలను ప్రశ్నించిన పోస్ట్‌కే కావడంతో, దీన్ని చాలామంది చిన్న సిగ్నల్‌గా తీసుకుంటున్నారు. ప్రణయ్ తన వైపు కథ చెప్పేశారు. దీపిక పూర్తిగా మాట్లాడితే మాత్రం ఈ వివాదంలో మరో వెర్షన్ కూడా బయటకు వస్తుంది.

Tags:    

Similar News