అఫీషియల్: కల్కి సీక్వెల్ నుంచి ఆ క్యారెక్టర్ ఔట్
కల్కి 2898ADలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఇకపై సీక్వెల్‌లో భాగం కాబోరని వైజయంతి మూవీస్ ప్రకటించింది.;
ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి 2898 AD సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అద్భుతమైన విజువల్స్, మైతాలజి కాన్సెప్ట్, స్టార్ కాస్ట్ కలయికతో ఈ సినిమా గ్లోబల్ రేంజ్‌లో చర్చనీయాంశమైంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తూ మేకర్స్ ప్రీ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు.
అయితే, తాజాగా వచ్చిన అఫీషియల్ స్టేట్‌మెంట్ మాత్రం అభిమానుల్లో చర్చకు దారి తీసింది. కల్కి 2898ADలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఇకపై సీక్వెల్‌లో భాగం కాబోరని వైజయంతి మూవీస్ ప్రకటించింది. ఇది ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో, బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
వైజయంతి మూవీస్ సోషల్ మీడియా ద్వారా ఒక నోట్ విడుదల చేసింది. “సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత కూడా మేము దీపికాతో భవిష్యత్ ప్రాజెక్ట్‌లో కొనసాగలేకపోతున్నాం. కల్కి 2898AD లాంటి సినిమా అనేది చాలా పెద్ద కమిట్‌మెంట్ అవసరం ఉన్నది. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం” అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీపికా భవిష్యత్ ప్రాజెక్టులకి శుభాకాంక్షలు కూడా తెలిపారు.
ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటాని లాంటి భారీ కాస్ట్‌తో రూపొందిన మొదటి భాగం ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటి చిత్రంలో దీపికా లాంటి నేషనల్ స్టార్ ఇక సీక్వెల్‌లో లేరని చెప్పడం అభిమానులకు ఒక పెద్ద షాక్‌గా మారింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మేకర్స్ ఎవర్ని రీప్లేస్ చేస్తారన్న విషయంపైనే ఉంది.
కొందరు ప్రముఖ బాలీవుడ్, సౌత్ హీరోయిన్ల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇంకా అధికారికంగా ఏదీ వెలువడలేదు. నాగ్ అశ్విన్ విజన్, వైజయంతి మూవీస్ బలమైన ప్రొడక్షన్ విలువలతో సీక్వెల్ కూడా భారీ విజువల్ స్పెక్టకిల్ అవుతుందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. మొత్తానికి, కల్కి 2898AD సీక్వెల్పై ఉన్న హైప్ కి మధ్యలో దీపికా ఔట్ అవడం ఒక పెద్ద ట్విస్ట్ గా మారింది. కానీ మేకర్స్ తీసుకున్న నిర్ణయం వెనుక కారణం సినిమా భవిష్యత్‌కి మంచిదే అని భావిస్తున్నారు. ఇప్పుడు కొత్త హీరోయిన్ ఎవరనేది బయటకొస్తే సీక్వెల్ హైప్ మరింతగా పెరగడం ఖాయం.