• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దసరా కాంబో.. ఈసారి అంతకు...

దసరా కాంబో.. ఈసారి అంతకు మించే..

| నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది రెండు చిత్రాలతో వచ్చి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-04-01 06:09 GMT

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది రెండు చిత్రాలతో వచ్చి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. దసరా, హాయ్ నాన్న మూవీలు సాలీడ్ కలెక్షన్స్ అందుకున్నాయి. డిసెంబర్ లో రిలీజైన హాయ్ నాన్న మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అయింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

జెర్సీ మూవీ తర్వాత మరో ఎమోషనల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ తో హాయ్ నాన్న రూపంలో సందడి చేశారు నాని. ఇక ప్రస్తుతం .. వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఆగస్టు 29వ తేదీన రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. నాని ఇటీవల మరో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తనకు రూ.100 కోట్ల హిట్ ఇచ్చిన దసరా మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మళ్లీ చేతులు కలిపారు. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. అనౌన్స్మెంట్ సమయంలో రిలీజ్ చేసిన పోస్టర్ అంతా బ్లడ్ కలర్ లో ఉంది. నాని షర్ట్, కళ్లద్దాల్లో ప్రజలు ఉన్నట్టు కనిపిస్తున్న పోస్టర్ మంచి ఆసక్తిని పెంచుతోంది.

అయితే ఈ మూవీ యాక్షన్ జోనర్ లో మంచి పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నాని ఒక మాస్ నాయకుడిగా నటించనున్నారని సమాచారం. అలాగే దర్శకుడు ఇంతవరకు ఎవరు టచ్ చేయని పొలిటికల్ పాయింట్స్ ను ఈ సినిమాలో హైలెట్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నేచురల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించనున్నారు.

ఇక నాని లైనప్ ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం చేస్తున్న నాని.. ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్ లో వర్క్ చేయనున్నారు. అదే సమయంలో శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కించనున్నారు. ఆ తర్వాత బలగం వేణుతో మంచి విలేజ్ లవ్ స్టోరీ చేయనున్నారట. త్రివిక్రమ్, శైలేష్ కొలనుతో కూడా సినిమాలు చేయనున్నట్లు సమాచారం. చూడాలి మరి నేచురల్ స్టార్ కొత్త చిత్రాలు ఎలా ఉంటాయో.

Tags:    
  • Nani 
  • Srikanthodela 
  • Movie 
  • Dasara 
  • Tollywood 
  • Hinana 
  • Filmindustry 
  • Sudhakar 
  • Sujeeth 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS