స్టార్ హీరో సినిమాని నిరాకరించిన ప్రేక్షకులు.. ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ..!
అయితే ఈ సినిమా హీరో దర్శన్.. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో.. పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.;
ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ అంటే చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అనుకునేవాళ్ళు. కానీ కేజీఎఫ్, కాంతార లాంటి సినిమాలు…ఆ అపోహలను పూర్తిగా మార్చేశాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం మళ్ళీ కన్నడ ఇండస్ట్రీకి సమస్యలు తప్పేలా లేవు.
ఇటీవల కన్నడ సినీ పరిశ్రమలో భారీ అంచనాలతో విడుదలైన ది డెవిల్.. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఈ ఏడాది వచ్చిన సినిమాల్లోనే పెద్ద ఫ్లాప్‌లలో ఒకటిగా నిలిచింది. మొదటి వారాంతంలోనే సినిమా కలెక్షన్లు చాలా తక్కువగా ఉండటంతో ట్రేడ్ వర్గాలు.. షాక్ కి గురవుతున్నాయి. ఒక స్టార్ హీరో సినిమా అయి కూడా..ప్రపంచవ్యాప్తంగా తొలి వీకెండ్ కలెక్షన్లు ₹30 కోట్లకు కూడా చేరకపోవడం వల్ల సినిమా పరిస్థితి.. అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది.
అయితే ఈ సినిమా హీరో దర్శన్.. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో.. పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులు కూడా.. సినిమాపై తీవ్ర ప్రభావం చూపాయి. తన అభిమానిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో దర్షన్ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన న్యాయ నిర్బంధంలో ఉన్నారు. ఈ వివాదం సినిమా కంటే.. ఎక్కువగా వార్తల్లో నిలవడంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపలేదు. చాలామంది ఈ కేసు వల్ల కూడా దర్శన్ సినిమా చూడకూడదు అని నిర్ణయించుకున్న వారు ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ కథ రాజకీయ నేపథ్యంతో సాగుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి కుమారుడు రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా..పరిస్థితుల వల్ల తిరిగి వచ్చి ఎన్నికల ప్రచారాన్ని నడపాల్సి వస్తుంది. ఈ సమయంలో పార్టీ నాయకులు ఒక చిన్న పట్టణానికి చెందిన ముఖ్యమంత్రి లుక్ అలైక్‌ను తీసుకువచ్చి తాత్కాలికంగా ఆ స్థానంలో ఉంచుతారు. ఆ వ్యక్తి ప్రజలతో కలిసిపోయి వారి సమస్యలను అర్థం చేసుకుంటాడు. కానీ రాజకీయాల్లో ఉన్న మోసాలు, కుట్రలు, ఒత్తిళ్లు అతడిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఆ తరువాత ఏమైంది అనేది సినిమా కథ. ఈ సినిమాలో దర్షన్‌తో పాటు మహేష్ మంజ్రేకర్, అచ్యుత్ కుమార్, రచనా రాయ్, శర్మిళా మండ్రే ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇక ఈ సినిమా పరాజయం ఈ ఏడాది ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న కన్నడ సినీ పరిశ్రమకు మరో దెబ్బగా మారింది. ఈ సంవత్సరం పరిశ్రమకు పెద్దగా విజయాలు లేవు. కాంతార : చాప్టర్ 2, సూ ఫ్రమ్ సో.. సినిమాలు తప్ప మిగతావన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఈ క్రమంలో.. ఇప్పుడు ఈ స్టార్ హీరో సినిమా కూడా దిజాస్టర్ అవ్వడంతో.. ఈ సంవత్సరం కన్నడ ఇండస్ట్రీ .. పెద్దగా హిట్లు లేక సంక్షోభంలో పడింది.