జైల్లో ఉన్న హీరో సినిమా రిలీజ్‌ డేట్‌ కన్ఫర్మ్‌

నిర్మాతలు భారీ బడ్జెట్‌ పెట్టడంతో వారి కోసం కొన్ని రోజులు కేటాయించి సినిమాను ముగించిన దర్శన్‌ తిరిగి జైలుకు వెళ్లాడు అంటూ కన్నడ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.;

Update: 2025-10-08 06:20 GMT

కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనను ఎంతగానో అభిమానించే రేణుక స్వామిని అత్యంత క్రూరంగా హత్య చేయించిన కేసులో దర్శన్‌ అరెస్ట్‌ అయ్యి జైల్లో ఉన్న విషయం తెల్సిందే. బెయిల్‌ పై దర్శన్‌ బయటకు వచ్చిన కొన్నాళ్లకే మళ్లీ జైలుకు వెళ్లాడు. సుప్రీం కోర్ట్‌ బెయిల్‌ రద్దు చేయడంతో చేసేది లేక మళ్లీ జైలుకు వెళ్లిన దర్శన్‌ నటించిన డెవిల్‌ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. గత ఏడాదిలో దర్శన్‌ జైలుకు వెళ్తున్న సమయంలో డెవిల్‌ సినిమా సగంకు పైగా షూటింగ్‌ పూర్తి అయినట్లు ప్రచారం జరిగింది. ఆ మధ్య జైలు నుంచి బెయిల్‌ పై వచ్చిన దర్శన్‌ జెట్‌ స్పీడ్‌తో సినిమాను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. నిర్మాతలు భారీ బడ్జెట్‌ పెట్టడంతో వారి కోసం కొన్ని రోజులు కేటాయించి సినిమాను ముగించిన దర్శన్‌ తిరిగి జైలుకు వెళ్లాడు అంటూ కన్నడ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

దర్శన్‌ హీరోగా నటించిన డెవిల్‌ మూవీ..

దర్శన్‌ అభిమానులు మాత్రమే కాకుండా కన్నడ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా డెవిల్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. దర్శన్‌ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో డెవిల్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. దర్శన్‌ జైల్లో ఉన్నా కూడా అభిమానుల గుండెల్లోనే ఉన్నాడు అంటూ కన్నడ మీడియాలో వస్తున్న కథనాలు, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తే అర్థం అవుతుంది. ఎప్పటికప్పుడు డెవిల్‌ సినిమా అప్‌డేట్‌ కోసం నిర్మాతలను దర్శన్‌ అభిమానులు అడుగుతూ వచ్చారు. ఎట్టకేలకు సినిమా విడుదల తేదీని డెవిల్‌ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న డెవిల్‌ సినిమాను డిసెంబర్‌ 12న భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

డెవిల్‌ మూవీ విడుదల తేదీ ప్రకటన

దర్శన్‌ ను చాలా విభిన్నంగా చూపించబోతున్నట్లుగా డెవిల్‌ ఫిల్మ్‌ మేకర్స్ చాలా కాలంగా చెబుతున్నారు. పైగా టైటిల్‌ చాలా విభిన్నంగా ఉండటంతో పాటు, డెవిల్‌ లో దర్శన్‌ లుక్‌ సైతం కొత్తగా ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఆకట్టుకునే కథ, కథనంతో డెవిల్‌ ఉండబోతుంది అనే విశ్వాసంను నిర్మాతలు, చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి సినిమా యొక్క పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్‌ లో సినిమాను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో దర్శన్‌ ఆ టైమ్‌ లో బెయిల్‌ పై బయటకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఆ సమయంలో దర్శన్‌ బెయిల్‌ పై బయటకు వచ్చినా సినిమా ప్రమోషన్‌కి మీడియా ముందుకు వస్తాడా అనేది చూడాలి.

అభిమాని రేణుక స్వామి హత్య కేసు విచారణ

కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రేణుక స్వామి హత్య కేసులో దర్శన్‌ ప్రత్యక్ష దోషి అంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించిన విచారణ చాలా సీరియస్‌గా సాగుతోంది. హీరో గారు రేణుక స్వామి కుటుంబ సభ్యులతో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేశాడని, పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్‌ చేసినా కూడా సదరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని కన్నడ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తనను దేవుడిగా అభిమానించిన ఒక అభిమానిని అత్యంత క్రూరంగా ఎలా చపించారు అంటూ దర్శన్‌ ను ఇప్పటికీ చాలా మంది విమర్శిస్తూ ఉంటే, ఆయన అభిమానులు మాత్రం ఇప్పటికీ తమ అభిమానంను కొనసాగిస్తున్నారు. ఆయన నటించి గత ఏడాది విడుదల అయిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

Tags:    

Similar News