రివ్యూల సౌండ్ లేదు.. దర్శన్ కొత్త మూవీ సంగతేంటి?
హత్య కేసులో దర్శన్ జైలులో ఉన్నా.. అనేక చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. తమ హీరోను స్క్రీన్ మీద చూసుకోవడానికి అభిమానులంతా ఎగబడ్డారు.;
కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప ఇప్పుడు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. రీసెంట్ గా బెయిల్ పై బయటకు వచ్చి తన సినిమాలు తాను చేసుకుంటూ ఉండటంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో మళ్లీ దర్శన్ జైలులో అడుగు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు మధ్యలో ఉన్న సినిమాలన్నీ ఆగిపోయాయి. కంప్లీట్ అయిన ది డెవిల్ మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 11వ తేదీన థియేటర్స్ లో కర్ణాటక అంతటా రిలీజ్ అయింది. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్స్ కు తరలివచ్చారు.
హత్య కేసులో దర్శన్ జైలులో ఉన్నా.. అనేక చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. తమ హీరోను స్క్రీన్ మీద చూసుకోవడానికి అభిమానులంతా ఎగబడ్డారు. టికెట్ రేట్లు భారీగా ఉన్నా.. హౌస్ ఫుల్స్ అవ్వడం గమనార్హం. హీరో బయట లేకపోయినా, ప్రమోషన్స్ చేయకపోయినా దర్శన్ క్రేజ్ మాత్రం తగ్గినట్టు లేదు.
కానీ డెవిల్ మూవీకి రివ్యూల సౌండ్ మాత్రం లేదు. ఎందుకంటే ఆ సినిమా మేకర్స్.. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. మేకర్స్ అప్పీల్ ను అనుసరించి ఆన్ లైన్ రివ్యూలను, రేటింగ్స్ ను ఇవ్వొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని కారణంగా బుక్ మైషో వంటి ప్లాట్ ఫారమ్ లు ఏకంగా రేటింగ్ ఆప్షన్ ను తొలగించాయి.
సాధారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా ఆడియన్స్ మొదట చూసేది రేటింగ్స్, రివ్యూల కోసమే. కానీ డెవిల్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఎక్కడా ఒక్క రివ్యూ కనిపించలేదు. రేటింగ్ కూడా లేదు. అయితే రేటింగ్స్ లేకపోవడంతో సినిమా అసలు ఫలితం ఏంటనేది నార్మల్ ఆడియన్స్ కు తెలియలేదు.
కేవలం సోషల్ మీడియాలో మౌత్ టాక్ మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. దాని బట్టి చూస్తే.. సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమా అనుకున్న స్థాయిలో లేదని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కంటెంట్ బాగోలేదని చెబుతున్నారు. ఇంకొందరు దర్శన్ డ్యూయల్ రోల్ లో బాగా చేశారని అంటున్నారు. మూవీ నచ్చిందని అంటున్నారు. ఏదైనా ఈ మధ్య కాలంలో రివ్యూ సౌండ్ లేకుండా ఉండడం ఇదే తొలిసారి అయుండొచ్చు.