మండే టెస్ట్ పాసైన డెకాయిట్.. ఇప్పుడు మరో బూస్ట్..

ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌ లో బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే మిలియన్ డాలర్ల మైలురాయిని కేవలం రెండు రోజుల్లోనే దాటేసింది.;

Update: 2026-04-14 04:56 GMT

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ సినిమా డెకాయిట్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ మంచి కలెక్షన్లతో అదిరిపోయే రన్ కొనసాగిస్తోంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా వర్కింగ్ డే అయిన సోమవారం కూడా సినిమా చూపించిన స్టేబులిటీ హాట్ టాపిక్‌ గా మారింది.

దర్శకుడు షానియల్ డియో తెరకెక్కించిన ఆ మూవీ, వీకెండ్ తర్వాత మండే కూడా తన గ్రిప్‌ ను కోల్పోలేదు. దీంతో వీక్ డేస్ టెస్ట్ పాస్ అయినట్లే. అదే సమయంలో గత 24 గంటల్లో ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ ఫామ్ బుక్ మై షోలో 53 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడం గమనార్హం. ఇది సినిమాపై ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదని స్పష్టంగా చూపిస్తోంది. దేశీయ మార్కెట్‌ తో పాటు ఓవర్సీస్ లో కూడా డెకాయిట్ తన ప్రభావాన్ని చూపిస్తోంది.

ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌ లో బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే మిలియన్ డాలర్ల మైలురాయిని కేవలం రెండు రోజుల్లోనే దాటేసింది. అదే జోష్ తో మరిన్ని వసూళ్లు సాధించేందుకు.. కొత్త మైల్ స్టోన్స్ క్రియేట్ చేసేందుకు.. వేగంగా దూసుకెళ్తోంది. ఇది చిన్న సినిమాగా వచ్చినప్పటికీ.. పెద్ద చిత్రాల స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందనే చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో కూడా డెకాయిట్ మంచి రన్ కొనసాగిస్తోంది. ఓపెనింగ్ వీకెండ్‌ లో స్ట్రాంగ్ కలెక్షన్లు సాధించిన ఆ చిత్రం, వీక్‌ డేస్‌ లో కూడా అదే ఊపును కొనసాగించడం విశేషం. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఆ సినిమాపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బిజినెస్ పరంగా చూస్తే, నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఇప్పటికే కంప్లీట్ సేఫ్ జోన్‌ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

రిలీజ్‌ కు ముందు తీసుకున్న స్ట్రాటజిక్ ప్లానింగ్, అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చిన ఆదాయం వల్ల పెట్టుబడి ఎక్కువ భాగం ముందుగానే రికవరీ అయింది. దీంతో ప్రస్తుతం థియేటర్లలో వస్తున్న కలెక్షన్లు లాభాలుగా మారుతున్నాయి. ఇక నేడు అంబేద్కర్ జయంతి.. పబ్లిక్ హాలిడే కూడా సినిమాకు అదనపు బూస్ట్ ఇవ్వనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్థాయిలో ఉండటంతో, డే 5 కలెక్షన్లు గట్టిగా ఉండేలా ఉన్నాయి.

దీంతో అదే జరిగితే.. డెకాయిట్ మూవీ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి.. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే చిన్న, మీడియం రేంజ్ సినిమా అయినా పెద్ద విజయం సాధించగలదని డెకాయిట్ మరోసారి నిరూపిస్తుందని చెప్పాలి. అడివి శేష్ కెరీర్‌ లో ఇది మరో సాలిడ్ హిట్‌ గా ఆ సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News