B.M.S లో ఇక ఆ పప్పులు ఉడకవు..!
టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అవుతుందో దాని వల్ల వచ్చే లాభాలు ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువ నష్టాలు ఉంటాయి.;
టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అవుతుందో దాని వల్ల వచ్చే లాభాలు ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువ నష్టాలు ఉంటాయి. సరైన విధంగా వాడితే ఏదైనా బాగుంటుంది కానీ అలా కాకుండా దాన్ని మిస్ యూజ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ క్రమంలో స్టార్ సినిమాల ఫేట్ డిసైడ్ చేస్తున్న బుక్ మైక్ షో రేటింగ్స్, రివ్యూల మీద కోర్ట్ కొత్త ఆంక్షలు విధించింది. స్టార్ సినిమా వస్తే చాలు ఆ సినిమా రియల్ టాక్ తో సంబంధం లేకుండా కొంతమంది బి.ఎం.ఎస్ నెగిటివ్ రేటింగ్స్ ఇంకా రివ్యూస్ ఇస్తున్నారు.
ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద..
ఐతే ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద పడుతున్నాయి. అందుకే దీనికి చెక్ పెట్టేందుకు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ మేకర్స్ B.M.S రేటింగ్స్ ను అడ్డుకునేలా కోర్ట్ ఆర్డర్ తెచ్చారు. కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఎం.ఎస్.జి సినిమాకు బుక్ మై షోలో ఎలాంటి రేటింగ్స్ కనిపించవు. అంతేకాదు యూజర్స్ ఎవరైనా ఎలాంటి రివ్యూ ఇవ్వడానికి వీళ్లేదు.
మన శంకర వర ప్రసాద్ సినిమా ఫాలో అయ్యే ఈ ప్రాసెస్ ని అన్ని సినిమాలు పాటించే ఛాన్స్ లేకపోలేదు. ముఖ్యంగా స్టార్ సినిమా వస్తే చాలు సినిమా ఎలా ఉంది అన్న ఒరిజినల్ టాక్ తో అసలేమాత్రం సంబంధం లేకుండా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. దీనిపై నిర్మాతలు కొన్నిసార్లు స్పందిస్తున్నా కూడా సరైన సొల్యూషన్ దొరకట్లేదు. ఐతే మన శంకర వరప్రసాద్ టీం తెలివైన నిర్ణయంతో కోర్ట్ ఆర్డర్ తో బి.ఎం.ఎస్ రేటింగ్ కి చెక్ పెట్టేలా చేశారు.
సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలని చేసే ప్రయత్నంలో..
తమ హీరో సినిమా ఎలా ఉన్నా బాగుందనే అభిమాని.. వేరే హీరో సినిమా ఐతే మాత్రం నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటారు. సోషల్ మీడియా తెరిస్తే చాలు ఇలాంటి మిస్ లీడ్ మెసేజెస్, కామెంట్స్ చాలా ఉంటున్నాయి. ఒక కామన్ మ్యాన్ సినిమా చూడాలని ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలని చేసే ప్రయత్నంలో సినిమా గురించి ఈ నెగిటివ్ కామెంట్స్ అతన్ని సినిమా చూడకుండా చేస్తున్నాయి. అందుకే బి.ఎం.ఎస్ రేటింగ్స్ తో మొదలైన ఈ యుద్ధం సోషల్ మీడియాలో కూడా అలాంటి ఆంక్షలు తెచ్చేలా చేస్తే మాత్రం సినిమా పరిశ్రమ బాగుండే ఛాన్స్ ఉంటుంది.
బుక్ మై షో లో రేటింగ్స్, రివ్యూస్ కూడా పెయిడెడ్ గా ఉంటాయని తెలిసిందే. దీనిపై కొందరు నిర్మాతలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఐతే ఇప్పుడు B.M.S రేటింగ్స్ కు ఛాన్స్ లేదు. మన శంకర వరప్రసాద్ వేసిన ఈ తొలి అడుగు అన్ని సినిమాలు ఇలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అందరు చూసే సూపర్ ఎంటర్టైనర్ సినిమాలు వస్తున్నాయి. వాటిలో ఏది ఎక్కువ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి సూపర్ అనిపించుకుంటాయన్నది చూడాలి.