అతని వల్లే కూలీ సినిమా సాధ్యమైందా?
ఒకరోజు అనిరుద్ తో మాట్లాడుతూ.. రజనీకాంత్ తో పెండింగ్ ఉండిపోయిన సినిమా గురించి మనసులో కోరిక చెప్పారట లోకేష్ కనగరాజ్ .;
పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద మోస్ట్ ఎవైటెడ్ చిత్రంగా నిలిచిన చిత్రం కూలీ. రజనీకాంత్ హీరోగా.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో భారీ తారాగణం నటించడం మరింత ప్లస్ గా మారింది. ముఖ్యంగా నాగార్జున ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ ఉండడం, ఆయన లుక్స్ సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయి. అలాగే హీరోయిన్ శృతిహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, అమీర్ ఖాన్ తదితర నటీనటులు నటించారు. ఇక ఈ సినిమా నుండి విడుదలైన "మోనికా" పాట ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. దీనికి తోడు ఈ స్పెషల్ సాంగ్ లో అటు పూజా హెగ్డే ఇటు సౌబిన్ షాహిర్ ఇద్దరు కూడా పోటీపడి మరీ డాన్స్ చేశారు.
ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ అందించడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుంచి వెలువడిన ఒక అప్డేట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కూలీ సినిమాకి బీజం పడడానికి ముఖ్య కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అని సమాచారం. ఈ విషయం వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది నిజమేనని.. స్వయంగా అనిరుధ్ బయట పెట్టడం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే.. లోకేష్ కనగరాజ్ ఖైదీ సినిమాని తెరకెక్కించే సమయంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఒక చిత్రం చేయాలని అనుకున్నారట. అలా మూడు సంవత్సరాల పాటు రజనీకాంత్ కోసం ఒక లైన్ రాసుకొని రజనీకాంత్ కు వినిపిస్తే.. అది కాస్త సిద్ధం కాకుండానే.. కమల్ వచ్చి విక్రమ్ కోసం లోకేష్ ను తీసుకెళ్లిపోయాడు. ఇక దానికన్నా ముందు మాస్టర్ , ఆ తర్వాత లియో ఇలా ఏళ్ళు గడిచిపోయాయి.
కానీ రజనీకాంత్ తో సినిమా చేయాలనే లోకేష్ కోరిక మాత్రం అలాగే ఉండిపోయిందట. ఒకరోజు అనిరుద్ తో మాట్లాడుతూ.. రజనీకాంత్ తో పెండింగ్ ఉండిపోయిన సినిమా గురించి మనసులో కోరిక చెప్పారట లోకేష్ కనగరాజ్ . ఆయన కోసం రాసుకున్న కథలో కొంత భాగం వినిపించారట. వెంటనే ఇంప్రెస్ అయిన అనిరుద్.. వెంటనే చొరవ తీసుకొని లోకేష్ - రజనీకాంత్ కలిసేలా చూసాడట . ఇక కథ విన్నాక అటు రజినీకాంత్ కి కూడా బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి తోడు ఖైదీ, మాస్టర్, లియో సినిమాలతో సక్సెస్ అందుకోవడంతో.. ఆయన టేకింగ్ పై ఎలాంటి అనుమానం లేకపోవడం.. అటు ఈ సినిమాకి జైలర్ నిర్మాతలు సన్ పిక్చర్ లైన్ లోకి తీసుకురావడం.. అన్నీ కలిసొచ్చాయి. అలా అనిరుధ్ చొరవతో ఈ సినిమా పట్టాలెక్కింది.
ఒకవేళ అనిరుద్ గనుక వెంటనే స్పందించక పోయి ఉంటే.. ఈ కూలీ సినిమా ఇంకా ఆలస్యం అయ్యేది అని సమాచారం ఏది ఏమైనా ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లు అంతా కూడా అతి తక్కువ సమయంలోనే ఏకంగా సూపర్ స్టార్ తో సినిమా చేసే అవకాశాలు అందుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అందులో భాగంగానే కార్తీక్ సుబ్బరాజు, పా. రంజిత్, నెల్సన్ దిలీప్ కుమార్ ఇలా చాలామంది డైరెక్టర్లు ఇండస్ట్రీకి వచ్చి కనీసం 10 సినిమాలు కూడా చేయకుండానే.. సూపర్ స్టార్ సినిమా చేయిస్తున్నారు అంటే.. ఇక వారు తమ టేకింగ్ తో సూపర్ స్టార్ ను ఏ రేంజ్ లో మెప్పిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు కూలీ సినిమా ఇప్పుడు పట్టాలు ఎక్కేసి, ఆగస్టు 14న విడుదల కాబోతోంది.