కూలీ క్రెడిట్ పై చర్చ.. అదంతా వేస్ట్ గురూ!

ముఖ్యంగా తెలుగు ఆడియన్స్.. సినిమాపై మంచి హోప్స్ పెట్టుకున్నారు. మూవీ చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. అంతలా బజ్ క్రియేట్ అయ్యి ఉంది.;

Update: 2025-06-26 19:12 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో కూలీ మూవీ రూపొందుతున్న మూవీ విషయం తెలిసిందే. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రుతి హాసన్, ఉపేంద్ర, సాబీన్ షాహిర్, రెబ్బా మోనికా జాన్, అమీర్ ఖాన్, జూనియర్ ఎంజీఆర్, పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు.

ఆగస్టు 14వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవ్వనున్న కూలీ మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. మూవీపై సూపర్ బజ్ క్రియేట్ చేసింది. కచ్చితంగా సినిమా చూడాలనే హైప్ ను నెలకొల్పింది.

ముఖ్యంగా తెలుగు ఆడియన్స్.. సినిమాపై మంచి హోప్స్ పెట్టుకున్నారు. మూవీ చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. అంతలా బజ్ క్రియేట్ అయ్యి ఉంది. అందుకు కారణం అక్కినేని నాగార్జున, రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ అనే చెప్పాలి. ముగ్గురికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండడంతో.. కూలీ మూవీపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.

అదే సమయంలో సోషల్ మీడియాలో కూలీ చిత్రానికి తెలుగులో ఉన్న బజ్ పై జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కుబేర మూవీ విజయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. సినిమా సక్సెస్ లో కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన వల్లే మూవీ హిట్ అయిందని పలువురు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇప్పుడు కూలీ మూవీపై ఉన్న బజ్ కు కూడా ఆయనే కారణమని, నాగ్ ఉనికి ఆ చిత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. నాగార్జున నటించడమే సినిమా విజయంగా భావిస్తున్నారు. కుబేరతో సరైన హిట్ అందుకున్న ఆయనకు కూలీ మూవీ బజ్ క్రెడిట్ కూడా ఇస్తున్నారు.

మరోవైపు, ఇతర అభిమానులు, సినీ ప్రేమికులు దీనిని ఒక సాధారణ ట్రెండ్‌ గా చూస్తున్నారు. ఎందుకంటే టాలీవుడ్ లో లోకేష్ తోపాటు రజినీకి కూడా మంచి క్రేజ్ ఉంది. మిగతా ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు కూడా ఉన్నారు. అందుకే బజ్ ఏర్పడిందని చెబుతున్నారు. అభిమానులు అనవసరమైన కామెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. సినిమా రిజల్ట్ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు ఫ్యాన్స్ వేస్ట్ చర్చలు జరపొద్దని సూచిస్తున్నారు.

Tags:    

Similar News