• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా Vs అల్లు: ఈ ఐడియా...

మెగా Vs అల్లు: ఈ ఐడియా ఏదో బాగుందే!

| ఈరోజుల్లో జనాల దృష్టిని ఆకర్షించడానికి మేకర్స్ డిఫెరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీలను వర్కౌట్ చెయ్యాల్సి వస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-07-19 08:50 GMT

ఈరోజుల్లో జనాల దృష్టిని ఆకర్షించడానికి మేకర్స్ డిఫెరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీలను వర్కౌట్ చెయ్యాల్సి వస్తోంది. మాములుగా టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయడమే కాదు.. ఏదైనా కొత్తగా యూనిక్ వేలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తేనే ప్రేక్షకులు ఆ సినిమా గురించి ఆలోచించి థియేటర్ల వరకూ వచ్చే పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు 'ఆయ్' & 'కమిటీ కుర్రోళ్లు' చిత్ర బృందాలు తమ సినిమాలను జనాలకు చేరువ చెయ్యడానికి విభిన్నమైన ప్రచార మార్గాల్లో వెళ్తున్నాయి. అయితే వేర్వేరుగా కాకుండా రెండు టీమ్స్ కలిసే ప్రమోషన్స్ చేస్తుండటం అందరినీ ఆకర్షిస్తోంది.

అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆయ్'. ఈ కామెడీ ఎంటర్టైనర్ ను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు మెగా డాటర్ నిహారిక కొణిదెల హోమ్ బ్యానర్ లో రూపొందుతున్న సినిమా 'కమిటీ కుర్రోళ్లు'. ఈ చిత్రాన్ని కూడా ఆగస్టులోనే రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. వచ్చే నెలలో థియేటర్లలోకి రాబోతున్న ఈ రెండు సినిమాలను మేకర్స్ దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా స్నేహపూర్వకంగా ఘర్షణ పడటానికి రెడీ అయ్యారు. నిర్మాతలు బన్నీ వాసు, నిహారిక ఇద్దరూ సవాళ్లు విసురుకుంటూ సై అంటే సై అంటున్నారు.

'గోదారోళ్లు Vs గోదారోళ్లు మధ్య అల్టిమేట్ క్రికెట్ క్లాష్ ను చూసే సమయం ఆసన్నమైంది' అంటూ 'ఆయ్' & 'కమిటీ కుర్రోళ్లు' చిత్ర బృందాలు తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసారు. ఇందులో ఆయా చిత్రాల నిర్మాతలు బన్నీ వాస్, నిహారిక కొణిదెల ఒక క్రికెట్ మ్యాచ్ కోసం ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. 'హలో నిహారిక గారు, మ్యాచ్ కు సిద్ధమా?' అని బన్నీ వాసు ఛాలెంజ్ చేయగా.. 'ఓడిపోడానికి మీరు సిద్ధమా?' అని నిహారిక కౌంటర్ ఇచ్చింది. 'మాతో అంత ఈజీ కాదు, కప్ పట్టుకెళ్ళిపోతాం' అని ఆయ్ నిర్మాత అంటే.. 'ఏంటి, కాఫీ కప్పా?' అని నిహారిక పంచ్ వేసింది.

'సై అంటే సెకన్ కో వికెట్ తీసుకెళతాం' అని నిహారిక అంటే.. 'సెకన్ కో వికెట్ ఎందుకు కానీ, మ్యాచ్ అయిపోయాక కప్ మాకిచ్చి ఆరు వికెట్లు మీరే పట్టుకెళ్లండి' అంటూ ఈసారి బన్నీ వాసు సెటైర్లు వేశారు. ఇలా ఇద్దరూ ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ, మ్యాచ్ కి సిద్దమే అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసురుకున్నారు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ అభిమానులతో పాటుగా ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఈరోజు(జులై 19) సాయంత్రం 6 గంటలకు జరగనున్న ఈ క్రికెట్ క్లాష్ ఈవెంట్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మామూలుగానే మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ మధ్య గొడవలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ రెండు కాంపౌండ్స్ కలిసి తమ చిత్రాలను సరికొత్తగా ప్రమోట్ చేయడం ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. ఆశ్చర్యకరంగా 'ఆయ్' 'కమిటీ కుర్రోళ్లు' రెండు సినిమాలు కూడా గోదావరి బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కడం విశేషం. మరి ఈ రెండిటిలో ఏ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి.

అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై రూపొందుతున్న 'ఆయ్' సినిమాలో మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియో బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మీ నిర్మిస్తున్నారు. నూతన నటీనటులతో డైరెక్టర్ వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు.

Time to witness the ultimate CRICKET CLASH between Godarollu vs Godarollu 🏏#AAY Producer #BunnyVas open challenge to #CommitteeKurrollu producer #NiharikaKonidela 🔥

Repu Groundlo Chuskundam! The match on July 19th at 6 PM❤️ pic.twitter.com/Nczfv9YL4R

— Geetha Arts (@GeethaArts) July 18, 2024
Tags:    
  • Committekurrollu 
  • Tollywood 
  • Filmindustry 
  • Niharikakonidela 
  • Bunnyvas 
  • AAY 
  • Promotions 
  • Cricketmatch 

Similar News

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

Copyright @2026

Powered by Blink CMS