స్మృతి, పలాష్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కొరియోగ్రాఫర్
ఇండియన్ స్టార్ ఉమెన్ క్రికెటర్ స్మృతి మందన్నా, పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడటం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.;
ఇండియన్ స్టార్ ఉమెన్ క్రికెటర్ స్మృతి మందన్నా, పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడటం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. స్మృతి మందన్నా తండ్రి అనారోగ్యానికి గురవడంతో పెళ్లి వాయిదా పడినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ పెళ్లి వాయిదా పడటానికి రోజుకో కారణాన్ని చెప్పుకొస్తున్నారు.
కొరియోగ్రాఫర్ తో కలిసి స్మృతిని మోసం చేశాడని..
ఈ నేపథ్యంలోనే పలాష్ ముచ్చల్ వ్యక్తిగత జీవితంపై కూడా ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. పలాష్ ఓ కొరియోగ్రాఫర్ తో కలిసి స్మృతిని మోసం చేశాడని అందుకే పెళ్లి వాయిదా పడిందని కూడా వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తల్ని సృష్టించిన వారు సదరు కొరియోగ్రాఫర్ పేరుని కూడా ప్రస్తావించడంతో ఆమె ఈ విషయంలో స్పందించి క్లారిటీ ఇచ్చారు.
ఈ విషయంపై ఆ కొరియోగ్రాఫర్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. గత కొన్నాళ్లుగా తనపై ఎన్నో వార్తలొస్తున్నాయని, తన వల్ల ఇతరుల సంబంధాలు పాడయ్యాయని ఎన్నో రాస్తున్నారని, తన గురించి జరుగుతున్న ఊహాగానాలు, తన వల్ల వేరే వారి రిలేషన్ చెడిపోవడంలో ఏ మాత్రం నిజం లేదని, సంబంధం లేని విషయంలోకి తనను లాగి మరీ అవాస్తవాలు మాట్లాడటం చాలా బాధాకరంగా ఉందన్నారు.
ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేకపోయినా ఆ వార్తలు మరింత ప్రచారం అవడం చూస్తుంటే కష్టంగా ఉందని ఆమె ఆరోపించారు. కొందరు రెడ్డిట్ లాంటి వాటి నుంచి వార్తలను ప్రచురిస్తున్నారని, అందులో ఎవరికి నచ్చింది వారు పోస్ట్ చేయొచ్చని, నిజం తెలుసుకోకుండా ఇష్టమొచ్చింది ప్రచారం చేస్తే పరువుకు నష్టం వాటిల్లుతుందని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.