• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరు కొత్త కాంబినేషన్.....

చిరు కొత్త కాంబినేషన్.. ఏంటి మ్యాటర్?

| స్టార్ డైరెక్టర్ తో హరీష్ శంకర్ తో చిరంజీవి కొత్త సినిమా దాదాపు ఫిక్స్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎప్పటి నుంచి ఈ కాంబోపై వార్తలు వస్తున్నా.. ఇప్పుడు ఖరారు అయినట్లు సమాచారం.

By - Tupaki Desk
Update: 2024-04-15 11:30 GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారుల్లో జరుగుతోంది. ఇటీవల చిరును మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు కలవడంతో మెగాస్టార్ లుక్స్ లీకయ్యాయి. ఈ మూవీలో సీనియర్ బ్యూటీ త్రిష.. చిరంజీవి సరసన ఆడిపాడనుంది. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరూ సిల్వర్ స్క్రీన్ పై జోడీగా సందడి చేయనున్నారు.

గత ఏడాది రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి.. 2024లో ఆయన నటించిన ఒక్క సినిమా కూడా విడుదల అవ్వడం లేదు. విశ్వంభర మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. 2025 జనవరి 10వ తేదీన విడుదల కానుంది. ఇక విశ్వంభర సినిమా కాకుండా చిరు చేతిలో మరే ప్రాజెక్టు లేదు. దీంతో మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారన్న సస్పెన్స్ చాలా నెలలుగా ఉంది.

ఓ వైపు విశ్వంభర షూటింగ్ జరుగుతుండగానే.. చిరు మరో మూవీ స్టార్ట్ చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. తన దృష్టంతా విశ్వంభర పైనే పెట్టారు మెగాస్టార్. టాలీవుడ్ కు చెందిన సుమారు 10 మంది డైరెక్టర్లు చిరంజీవితో సినిమా తీసేందుకు పోటీ పడుతున్నట్లు టాక్ వినిపించింది. తాజాగా చిరు తదుపరి సినిమాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

స్టార్ డైరెక్టర్ తో హరీష్ శంకర్ తో చిరంజీవి కొత్త సినిమా దాదాపు ఫిక్స్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎప్పటి నుంచి ఈ కాంబోపై వార్తలు వస్తున్నా.. ఇప్పుడు ఖరారు అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు బీవీఎస్ రవి స్టోరీ అందిస్తున్నారట. స్క్రిప్ట్ పై పూర్తి వర్క్ చేసి చిరు వినిపించమన్నారని తెలుస్తోంది. దీంతో హరీష్ తన ఫోకస్ అంతా కథపై పెట్టారట. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుందని టాక్.

మరోవైపు, హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాలు తీస్తున్నారు. ఉస్తాద్ షూటింగ్ కు పవన్ వల్ల బ్రేక్ పడటంతో మిస్టర్ బచ్చన్ ను పూర్తి చేస్తున్నారు హరీష్. మళ్లీ ఎన్నికల తర్వాత పవన్ ఉస్తాద్ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు. ఇక చిరు మరికొద్ది రోజుల్లో ఫ్రీ అవ్వనున్నారు. దీంతో 2024 లో చిరు- హరీష్ శంకర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వనున్నట్లు సమాచారం. మరి చూడాలి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో.

Tags:    
  • Chiranjeevi 
  • Visambhara 
  • Vashita 
  • Harishshankar 
  • Ustaadbhagatsingh 
  • Bvsravi 
  • Mrbachchan 
  • Raviteja 

Similar News

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

Copyright @2026

Powered by Blink CMS