శివుని త్రిశూలంతో మెగాస్టార్ విశ్వరూపం!
మెగాస్టార్ చిరంజీవి -టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సోషియో-ఫాంటసీ విజువల్ ఎపిక్ `విశ్వంభర`.
మెగాస్టార్ చిరంజీవి -టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సోషియో-ఫాంటసీ విజువల్ ఎపిక్ `విశ్వంభర`. రెండేళ్లుగా ఈ సంచలన చిత్రం కోసం చిత్ర యూనిట్ ఎంతో శ్రమిస్తోంది. ప్రతి ఫ్రేమ్‌ను పరిపూర్ణంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అత్యంత విస్తృతమైన వీఎఫ్‌ఎక్స్ పనులు ఉండటమే సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా దిగ్గజ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలు పని చేస్తుండటం విశేషం. దీంతో గ్రాఫిక్స్ - విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో రూపుదిద్దుకుంటున్నాయని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ ఓఎస్‌టీ సినిమాపై అంచనాలు ఆకాశన్నంటేలా చేస్తున్నాయి . `హనుమాన్`, ``మిరాయ్' వంటి చిత్రాలతో అదరగొట్టిన గౌర హరి చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రిలీజ్ అయిన ట్రాక్‌లో వాడిన సంస్కృత శ్లోకాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పి స్తున్నాయి. హై-ఎండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ రిచ్‌నెస్‌తో విశ్వాన్ని మించిన రాజసమైన మెగా మాస్ ట్రీట్‌గా నిలుస్తోంది.
ఇక కొత్త పోస్టర్‌లో చిరంజీవి కళ్ళు ఆకుపచ్చ రంగులో మెరుస్తుండగా..ఆయన పట్టుకున్న శివుని త్రిశూలంపై ఉన్న రత్నం ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ సినిమాలోని పవర్‌ఫుల్ మాస్ మూమెంట్స్‌కు అద్దం పడుతోంది. అలాగే నిర్మాణ రంగంలోనూ ఎక్కడా తగ్గకుండా యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ ..హంగులతో చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో మైలు రాయిగా నిలవనుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి.
ప్రస్తుతం పోస్ట్-ప్రొడ క్షన్ - వీఎఫ్‌ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే రిలీజ్ ఆలస్యమైన నేపథ్యంలో ఇకపై మేకర్స్ మరో ఛాన్స్ తీసుకోరు. తదుపరి ఏ తేదీ ప్రకటించినా పక్కాగా ఆ తేదీకే ప్రేక్షకుల ముందుకొచ్చేలా కట్టుబడటానికి అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తోన్న సోషియా ఫాంటసీ చిత్రం కావడంతో అభిమానులు సహా సాధారణ ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే చిరంజీవి `మన శంక వర ప్రసాద్ గారు`తో భారీ విజయాన్ని అందుకుని పుల్ ఫామ్ లో ఉన్నారు. ఆ విజయం మెగాస్టార్ ను వందల కోట్ల క్లబ్ లో కూర్చో బెట్టింది. ఈ నేపథ్యంలో `విశ్వంభర` బాక్సాఫీస్ టార్గెట్ కూడా భారీగానే ఉంటుందని చెప్పొచ్చు .