విశ్వంభ‌ర వ‌స్తుంది.. అనిల్ ఆగుతాడా?

ఇప్ప‌టికే విశ్వంభ‌ర షూటింగ్ ను పూర్తి చేసిన చిరూ, ప్ర‌స్తుతం హిట్ మిష‌న్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ క‌మ‌ర్షియ‌ల్ ఎంటర్టైన‌ర్ చేస్తున్న విష‌యం తెలిసిందే.;

Update: 2025-08-15 09:17 GMT

ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే విశ్వంభ‌ర షూటింగ్ ను పూర్తి చేసిన చిరూ, ప్ర‌స్తుతం హిట్ మిష‌న్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ క‌మ‌ర్షియ‌ల్ ఎంటర్టైన‌ర్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో విశ్వంభ‌ర సినిమా ముందుగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని అంద‌రికీ తెలుసు.

విశ్వంభ‌ర‌పై భారీ అంచ‌నాలు

బింబిసార త‌ర్వాత వ‌శిష్ట నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో పాటూ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తో చిరంజీవి సినిమా చేస్తుండ‌టం, చాలా కాలం త‌ర్వాత చిరూ చేస్తున్న‌ సోషియో ఫాంట‌సీ జాన‌ర్ మూవీ కావ‌డం వ‌ల్ల విశ్వంభ‌రపై భారీ అంచ‌నాలున్నాయి. కానీ ఎప్పుడైతే సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ ను రిలీజ్ చేశారో అప్ప‌ట్నుంచి సినిమాపై నెగిటివిటీ వ‌చ్చింది.

చిరూ బ‌ర్త్‌డేకు కొత్త టీజ‌ర్

టీజ‌ర్ లోని వీఎఫ్ఎక్స్ పై వ‌చ్చిన ట్రోల్స్, విమ‌ర్శ‌లకైతే లెక్కే లేదు. దీంతో చిత్ర యూనిట్ ఏకంగా వీఎఫ్ఎక్స్ కంపెనీని కూడా మార్చేసింది. అయితే ఇప్పుడు విశ్వంభ‌ర‌కు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వ‌ర్క్స్ ఓ కొలిక్కి వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. అందులో భాగంగానే చిరంజీవి పుట్టిన‌రోజు అయిన ఆగ‌స్ట్ 22న సినిమా నుంచి ఓ కొత్త టీజ‌ర్ తో పాటూ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారట‌.

మెగా157 నుంచి మ‌రో సర్‌ప్రైజ్‌

అందులో భాగంగానే ఇప్ప‌టికే టీజ‌ర్ ను కూడా క‌ట్ చేశార‌ని, డైరెక్ట‌ర్ వ‌శిష్ట‌కు స‌న్నిహితులైన కొంద‌రు ఆ టీజ‌ర్ చూసి అత‌న్ని ప్రశంసించార‌ని టాలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. సో మెగాస్టార్ బ‌ర్త్ డే కు విశ్వంభ‌ర నుంచి ఇప్ప‌టికే గిఫ్ట్ రెడీ అయిపోయింది. విశ్వంభ‌ర డైరెక్ట‌ర్ వ‌శిష్ట ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తే మెగా157 డైరెక్ట‌ర్ అనిల్ మాత్రం ఊరుకుంటారా? దాన్ని మించేలా సినిమా నుంచి అదిరిపోయే కంటెంట్ ను ఫ్యాన్స్ కు మెగాస్టార్ బ‌ర్త్ డే గిఫ్టుగా ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి ఈ ఇద్ద‌రిలో మెగాఫ్యాన్స్‌ను, మెగాస్టార్ ను ఎవ‌రు ఎక్కువ‌గా మెప్పిస్తారో చూడాలి.

Tags:    

Similar News