మెగాస్టార్ రీఎంట్రీ..దళపతి ఎగ్జిట్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ ఇద్దరి విషయంలో ఓ గమ్మత్తు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..;
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ ఇద్దరి విషయంలో ఓ గమ్మత్తు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార రజనీకాంత్, యాక్షన్ మూవీస్‌తో కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ కాంత్ సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంబించిన దళపతి విజయ్ తన నలభై ఏళ్ల నట ప్రస్థానంలో తమిళ నాట తిరుగులేని స్టార్ గా ఎదిగాడు. ప్రేక్షకుల్లో భారీ క్రేజ్‌తో పాటు మార్కెట్ వర్గాల్లోనూ భారీ డిమాండ్‌ని ఏర్పరచుకుని తిరుగులేని స్టార్ అనిపించుకున్నాడు.
1992లో తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ రూపొందించిన 'నాలైతీర్పు'తో హీరోగా అరంగేట్రం చేసి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. హీరోగా గత 33 ఏళ్లుగా సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కొని ఫైనల్‌గా తమిళ నాట తిరుగులేని స్టార్‌గా మారాడు. 2024 ఫిబ్రవరి 2న తాను రాజీకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించిన విజయ్ ఇందు కోసం స్వయంగా 'తమిళగ వెట్రి కళగం' పేరుతో కొత్త పార్టీని ప్రారంభించాడు. గత రెండేళ్లుగా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తూ కమటీలని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్న విజయ్ ఈ ఏడాది తమిళనాట జరగనున్న అసెంబ్లీ ఎన్నిలపై దృష్టి పెట్టాడు.
ఇందులో భాగంగానే సినిమాలకు గుడ్ బై చెప్పాడు. తను నటిస్తున్న చివరి సినిమా 'జన నాయగన్'. తెలుగులో దీన్ని 'జన నాయకుడు' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇది తెలుగు హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి`కి రీమేక్ అంటూ ప్రారంభం నుంచి వార్తలు మొదలయ్యాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని, ఇది కేవలం విజయ్ సినిమా మాత్రమేనని దర్శకుడు నమ్మించడానికి ప్రయత్నించాడు. అనిల్ రావిపూడి కూడా ఇదే పాట పాడినా ప్రేక్షకుల్లో నమ్మకం కుదరలేదు. ఫైనల్‌గా ట్రైలర్ రిలీజ్ తరువాత అందరి అనుమానాలు నిజమని తేలడంతో ఈ సినిమాపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
చిరు రీఎంట్రీ, విజయ్ ఎగ్జిట్ మూవీలపై చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాలలో యాక్టీవ్ కావాలని సినిమాలకు గుడ్ బై చెప్పారు. అయితే అది అంత సులవు కాదని తేలడంతో పదేళ్ల విరామం తరువాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన రీఎంట్రీ కోసం ఎంచుకున్నది ఓ రీమేక్ ఫిల్మ్‌ని. అదే 'కత్తి'. తమిళంలో విజయ్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ రూపొందించిన ఈ సినిమా తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ కావడం, సమకాలీన రాజకీయాంశాలు ఉండటంతో ఇది తన రీఎంట్రీకి కరెక్ట్ అని భావించి 'ఖైదీ నంబర్ 150'గా రీమేక్ చేయడం అది హిట్ కావడం తెలిసిందే.
అందుకు భిన్నంగా విజయ్ సినిమాల నుంచి తప్పుకుంటూ తన ఎగ్జిట్ ఫిల్మ్‌గా తెలుగు హిట్ మూవీ 'భగవంత్ కేసరి' ఎంచుకున్నాడు. అయితే ఆరోజుల్లో రీమేక్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఓటీటీలు లేకపోవడంతో రీమేక్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఓటీటీల ప్రభావం వల్ల రీమేక్ పేరు చెబితే స్టార్లు సైతం వణికిపోయే పరిస్థితి. ఈ తరుణంలో విజయ్ తెలుగు రీమేక్‌తో సినిమాలకు గుడ్ బై చెబుతుండటం ఆసక్తికరంగా మారింది. చిరు తరహాలో విజయ్‌కి సక్సెస్ లభించడం కష్టమని, ఈ విషయంలో విజయ్ పెద్ద సాహసమే చేస్తున్నాడని కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు వాపోతున్నాయి.