తెర మీద స్టార్స్ చిందులు.. సీట్లలో ఫ్యాన్స్ ఏమవుతారో..?
లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక క్రేజీ రోల్ చేయబోతున్నారు.;
తెలుగు తెర మీద ఈమధ్య మల్టీస్టారర్స్ ఎక్కువగానే వస్తున్నాయి. ఫ్యాన్స్ ని ఖుషి చేసేలా క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ కిక్ వేరేలా ఉంటుంది. అలాంటివి కూడా చేసి చూపిస్తున్నారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక క్రేజీ రోల్ చేయబోతున్నారు. ఈమధ్యనే చిరంజీవి, వెంకటేష్ కి సంబందిచిన సీన్స్ షూట్ చేశారట.
చిరంజీవి, వెంకటేష్ కలిసి ఒక క్రేజీ సాంగ్..
సినిమాలో వెంకటేష్ సెకండ్ హాఫ్ లో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. ఐతే చిరు, వెంకీ ఇద్దరు అలా కలిసి కనిపించడమే కాదు కలిసి స్టెప్పులు కూడా వేస్తారని తెలుస్తుంది. మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి, వెంకటేష్ కలిసి ఒక క్రేజీ సాంగ్ చేస్తున్నారట. ఈ సాంగ్ కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్. భీంస్ సిసిరోలియో మ్యూజిక్ సారధ్యంలో ఇప్పటికే మన శంకర వరప్రసాద్ నుంచి వచ్చిన మీసాల పిల్ల సూపర్ హిట్ కాగా ఈ స్టార్స్ ఇద్దరు కలిసి చేసే సాంగ్ కూడా అదిరిపోతుందట.
చూస్తుంటే అనిల్ రావిపూడి గట్టి ప్లానింగ్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది. మన శంకర వరప్రసాద్ సినిమాలో చిరంజీవి రోల్ కూడా మరోసారి ఫ్యాన్స్ కి వింటేజ్ స్టైల్ ని గుర్తు చేస్తుందని అంటున్నారు. సినిమాలో చిరంజీవే హైలెట్ అని అనుకుంటుంటే దానికి తోడుగా వెంకటేష్ కూడా మరో హైలెట్ గా నిలుస్తారట. తెర మీద ఈ ఇద్దరు స్టార్స్ కలిసి చేసే హంగామాకి సీట్లలో కూర్చున్న ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు.
ప్రభాస్ రాజా సాబ్ తో పాటు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి..
మన శంకర వరప్రసాద్ గారుసినిమా సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. సంక్రాంతి బరిలో స్టార్ సినిమాలు పోటీ ఉండనుంది. ప్రభాస్ రాజా సాబ్ తో పాటు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తితో వస్తున్నాడు. వీరితో పాటు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు, శర్వానంద్ నారి నారి నడుమ మురారి వస్తుంది. ఈ సినిమాల మధ్య ఏది సంక్రాంతికి విజయ పతాకాన్ని ఎగరవేస్తుంది అన్నది చూడాలి.
పొంగల్ రేసులో వస్తున్న ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి. ఐతే ఓవరాల్ గా అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే మెయిన్ టార్గెట్ తో వస్తున్నాయి. చిరు సినిమాతో పాటే నవీన్, రవితేజ, శర్వానంద్ సినిమాలు ఎంటర్టైనింగ్ మోడ్ లో వస్తుండగా రాజా సాబ్ ఒక్కటే థ్రిల్లర్ జోనర్ లో ఎంటర్టైన్ చేయాలని వస్తుంది.