మెగాస్టార్ యాక్షన్ కామెడీనా..?

అంత టాలెంట్ ఉంది కాబట్టే మెగాస్టార్ చిరంజీవిని తన కథ చెప్పి ఒప్పించాడు. చిరు, శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ వెనక నాని ఉన్నాడు.;

Update: 2025-05-27 20:30 GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమా ఒకటి లైన్ లో ఉంది. ఈమధ్యనే ఆ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టారు. 2026 సంక్రాంతి టార్గెట్ తో ఆ సినిమా రాబోతుంది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఐతే ఈ సినిమా తర్వాత ప్రాజెక్ట్ యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో లాక్ చేసుకున్నాడు చిరు. దసరా తో సూపర్ హిట్ అందుకుని తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన శ్రీకాంత్ ఓదెల తన రెండో సినిమా కూడా నానితోనే చేస్తున్నాడు. ప్యారడైజ్ అంటూ మరో పెద్ద స్కెచ్ తోనే నాని శ్రీకాంత్ కలిసి వస్తున్నారు. ప్యారడైజ్ ఫస్ట్ స్టేట్మెంట్ తోనే గూస్ బంప్స్ తెప్పించేలా చేశాడు శ్రీకాంత్ ఓదెల.

అంత టాలెంట్ ఉంది కాబట్టే మెగాస్టార్ చిరంజీవిని తన కథ చెప్పి ఒప్పించాడు. చిరు, శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ వెనక నాని ఉన్నాడు. ఈ సినిమాను నానినే తన యునానిమస్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఐతే ఈ సినిమా కథ యాక్షన్ కామెడీ అని తెలుస్తుంది. మెగా మాస్ ని టచ్ చేస్తూ చిరులోని ఆ కామెడీ టైమింగ్ ని వాడుకునేలా స్క్రిప్ట్ రాసుకున్నాడట. చిరంజీవి కథ వినగానే సూపర్ ఎగ్జైట్ అయ్యాడు కాబట్టే ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నారు. సో మెగాస్టార్ విశ్వంభర తర్వాత చేస్తున్న రెండు సినిమాలు కూడా సంథింగ్ స్పెషల్ ప్రాజెక్టులుగా రాబోతున్నాయి.

చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల చేసే సినిమా ప్యారడైజ్ రిలీజ్ తర్వాతే సెట్స్ మీదకు వెళ్తుంది. అప్పటివరకు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేస్తారని తెలుస్తుంది. చిరుతో యాక్షన్ కామెడీ మూవీ ప్లాన్ చేసిన శ్రీకాంత్ ఓదెల తప్పకుండా మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చే సినిమా ఇస్తాడని అంటున్నారు. సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే బ్లడ్ చూపించిన శ్రీకాంత్ మూవీ విషయంలో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తోనే ఉన్నాడని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి 157 సినిమా అనిల్ తో వస్తుండగా 158 సినిమా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమా 2027 లో రిలీజ్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.

Tags:    

Similar News