70 ఏళ్లలోనూ దూకుడు.. మెగాస్టార్ నెట్ వర్త్ ఎంతంటే?
ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో సందడి చేయనున్నారు.;
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఆయన రేంజే వేరు.. కొన్ని దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో సందడి చేయనున్నారు.
అయితే ఈ ఏడాదిలో విశ్వంభరతో కూడా చిరు సందడి చేయనున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో థియేటర్స్ లోకి రానున్న చిరంజీవి నెట్ వర్త్ కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి.. హీరోగానే కాకుండా పెట్టుబడులతో పెద్ద ఎత్తున ఆర్జించారని చెప్పాలి. నటుడిగా, బిజినెస్ మ్యాన్ గా, ఇన్వెస్టర్ గా చిరు బిజీ బిజీగా గడుపుతున్నట్లే.
1978లో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, 2006లో పెట్టుబడుల రంగంలోకి అడుగు పెట్టారు. హీరో నాగార్జున, బిజినెస్ మ్యాన్ నిమ్మగడ్డ ప్రసాద్ తో కలిసి మా టెలివిజన్ నెట్ వర్క్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో మా టీవీ విలువ సుమారు రూ.110 కోట్లుగా అంచనా వేయగా, ప్రమోటర్ గ్రూప్ రూ.66 కోట్ల పెట్టుబడిలో దాదాపు 20 శాతం వాటా చిరంజీవికి ఉందట.
కానీ చిరు ఇన్వెస్టర్ అని ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే 2015 నాటికి తెలుగు టెలివిజన్ రంగం ఏడాదికి సుమారు రూ.1800 కోట్ల వ్యాపారంగా మారింది. నాలుగు ఛానళ్లతో మా టీవీ దాదాపు 26 శాతం మార్కెట్ షేర్ ను అందుకుందని వినికిడి. అదే ఏడాది స్టార్ ఇండియా మా టీవీని రూ.2500 కోట్లకు కొనుగోలు చేయగా, చిరంజీవి వాటా విలువ రూ.400- 500 కోట్లకు చేరిందని సమాచారం.
ఆ తర్వాత బ్రాడ్ కాస్టింగ్ ఫీల్డ్ లోకి చిరు వచ్చారు. 2008లో ఐక్వెస్ట్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ గా మారి, సబ్స్క్రిప్షన్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2020 నాటికి ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీ వాల్యూ రూ.68,500 కోట్లు కాగా, అందులో రూ.43,400 కోట్లు సబ్స్క్రిప్షన్ నుంచే వచ్చిందట.. అదే సమయంలో 2016లో ఐఎస్‌ఎల్ లో కేరళ బ్లాస్టర్స్ కన్సార్టియంలో చిరంజీవి చేరారు.
ఆ తర్వాత మ్యాగ్నమ్ స్పోర్ట్స్ డైరెక్టర్ గా ప్రో కబడ్డీలో తమిళ్ తలైవాస్ యాజమాన్యంలో భాగమయ్యారు చిరంజీవి. ఆ ఫ్రాంచైజీల విలువ ఇప్పుడు రూ.100 కోట్లకు పైగానే ఉంది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో మ్యాట్రిక్స్ బ్యాడ్మింటన్ టీమ్ వర్క్స్ లో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఇక 1988లో అంజనా ప్రొడక్షన్స్ ద్వారా నిర్మాతగా మారారు.
ఆ బ్యానర్ పై రుద్రవీణ సినిమాను నిర్మించారు. నష్టాలు వచ్చినా అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా నిర్మించిన ఖైదీ నెం.150 ద్వారా మంచి లాభాలు అందుకున్నారు. అలా మొత్తం రెమ్యూనరేషన్లు, పెట్టబడులు, లాభాలు కలిపి చిరంజీవి నికర ఆస్తి విలువ సుమారు రూ.1650 కోట్లుగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.