చిరంజీవితో వెంకీమామ జతకట్టేది ఆ రోజే.. మరో సర్ప్రైజ్ ఏంటంటే?
మెగాస్టార్ చిరంజీవి.. ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.;
మెగాస్టార్ చిరంజీవి.. ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా వింటేజ్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. చివరిగా వాల్తేరు వీరయ్య, భోళాశంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 లేదా 14వ తేదీలలో విడుదల కాబోతోంది. త్వరలోనే ఈ విడుదల తేదీపై అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు.
ఇందులో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. ప్రముఖ స్టార్ సీనియర్ హీరో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ విషయాన్ని ఈ సినిమా టైటిల్ రిలీజ్ గ్లింప్స్ లో రివీల్ చేశారు. ముఖ్యంగా "మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు" అంటూ వెంకటేష్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ గ్లింప్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ అభిమానులలో హైప్ పెంచింది అని చెప్పవచ్చు.
అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో వెంకటేష్ తన పాత్ర షూటింగ్ ను కంప్లీట్ చేయడానికి.. అక్టోబర్ 20వ తేదీ నుంచి షూటింగ్ సెట్లో పాల్గొనబోతున్నారట. పది రోజులపాటు ఈ షూటింగు జరగనున్నట్లు సమాచారం. అంతేకాదు మరో షెడ్యూల్లో చిరంజీవి, వెంకటేష్ ఇద్దరిపై కూడా డైరెక్టర్ ఒక అద్భుతమైన సాంగ్ ప్లాన్ చేశారని.. ఆ సాంగ్ షూటింగ్ నవంబర్ లో ఉంటుందని సమాచారం. మొత్తానికి అయితే చిరంజీవి , వెంకటేష్ మధ్య సన్నివేశాలే కాదు పాటలు కూడా ఉన్నాయని తెలిసి అభిమానులు ఈ పాట కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. అలాగే షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి , సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలని అభిమానులు కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
చిరంజీవి విషయానికి వస్తే .. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేశారు. కానీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారు అనుకున్నారు. కానీ అటు పవన్ కళ్యాణ్ సినిమా 'ఓజీ' రిలీజ్ ఉండడంతో ఈ సినిమాను వాయిదా వేశారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా ఏకంగా సమ్మర్ కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇంకా వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాను రిలీజ్ చేసిన తర్వాత.. బాబి కొల్లి డైరెక్షన్లో తన తదుపరి చిత్రం షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.