మెగా 157 టైటిల్ రివీల్ పై అనిల్ రావిపూడి క్లారిటీ.. ఆ రోజే!

ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న మెగా157 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.;

Update: 2025-08-20 05:59 GMT

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న మెగా157 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక సాలిడ్ అప్డేట్ అభిమానులలో ఆనందాన్ని పెంచేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ షేర్ చేస్తూ అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.

మెగా 157 టైటిల్ రివీల్ ఆరోజే..

అసలు విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఈ మెగా 157 టైటిల్ రివీల్ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిని అధికారికంగా ప్రకటించేశారు అనిల్ రావిపూడి. లిటిల్ హాట్స్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న అనిల్ రావిపూడి.. ఆగస్టు 21న మెగాస్టార్ చిరంజీవి మూవీ టైటిల్ రివీల్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 కాగా.. ఆయన బర్తడే వేడుకలు ఒకరోజు ముందుగానే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ మేరకు ఆగస్టు 21న సాయంత్రం 4:32 గంటల నుంచి హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో మెగా 157 టైటిల్ కూడా రివీల్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో మెగా అభిమానులకు చిరు బర్త్ డే సందర్భంగా అదిరిపోయే ట్రీట్ రానుంది అనేది కన్ఫామ్ అయిపోయింది. ఈ సినిమాకు 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మరి దీనినే కన్ఫామ్ చేస్తారేమో చూడాలి. ఇకపోతే చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన పేరుతోనే ముడిపడిన టైటిల్ ని ఖరారు చేశారని అర్థమవుతుంది.

కూతురి నిర్మాణంలో చిరంజీవి సినిమా..

మెగా 157 సినిమా విషయానికి వస్తే.. ఇందులో ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై వస్తున్న ఈ సినిమా నిర్మాణంలో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల భాగమవడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రాలు..

మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తోటి నటీనటులైన వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోలతో పోటీ పడడమే కాకుండా ఇప్పుడు యంగ్ స్టార్ హీరోలకి కూడా గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. మరొకవైపు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. మరి ఈ సినిమాను విడుదల చేసిన తర్వాత మెగా 157 విడుదల చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. మరొకవైపు విశ్వంభర సినిమాను వచ్చే యేడాది సమ్మర్ కి వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విడుదల తేదీలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Tags:    

Similar News