అన్ని లీకులు ఇస్తున్న చిరు.. విశ్వంభరపై మాత్రం క్లారిటీ లేదా?
మెగాస్టార్ చిరంజీవి ఏదైనా ఈవెంట్ లోకి వచ్చారంటే చాలు, అక్కడ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ లీక్ బయటకు రావడం అలవాటైపోయింది.
మెగాస్టార్ చిరంజీవి ఏదైనా ఈవెంట్ లోకి వచ్చారంటే చాలు, అక్కడ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ లీక్ బయటకు రావడం అలవాటైపోయింది. రీసెంట్ గా బాబీ కొల్లి డైరెక్షన్ లో మొదలైన కొత్త సినిమా గురించి మాట్లాడుతూ 'కదిరి' అనే హింట్ కూడా ఆయన నుంచే బయటకు వచ్చింది. అప్పుడే మొదలైన కొత్త ప్రాజెక్ట్ టైటిల్ వరకు చిరంజీవి హింట్స్ ఇస్తున్నారు బాగానే ఉంది. కానీ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న విశ్వంభర సంగతి ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్.
టైమ్‌లైన్ పరంగా చూసుకుంటే విశ్వంభర సినిమా ఎప్పుడో థియేటర్లలోకి రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కంటే తర్వాత అనుకున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రం ఈ ఏడాది జనవరిలో రిలీజై చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ కామర్షియల్ హిట్ గా నిలిచింది. ఆ బ్లాక్ బస్టర్ వచ్చి కూడా చాలా నెలలు దాటిపోయింది. అయినా సరే విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల డిలే అవుతూ వచ్చిన విశ్వంభర ఇంకా థియేటర్ల ముందుకు రాకపోవడం గమనార్హం.
సరిగ్గా ఈ టైమ్ లోనే విశ్వంభరను దసరా రిలీజ్ గా తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని హింట్ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ప్రమోషన్లలో మాత్రం అనుకున్నంత మూవ్ మెంట్ కనిపించడం లేదు. దసరాకి రావడమే నిజమైతే ఈపాటికే టీజర్ లేదా అఫీషియల్ ప్రమోషనల్ ప్లాన్ స్టార్ట్ అవ్వాలి కదా అనే అనుమానాలు ఆడియన్స్ లో వ్యక్తమవుతున్నాయి.
గతంలో 'ఆచార్య' నుంచి రీసెంట్ సినిమాల వరకు చిరంజీవి చాలా విషయాలను సరదాగా ఈవెంట్స్ లో రివీల్ చేస్తూ 'చిరు లీక్స్' కి మంచి హైప్ తెచ్చారు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన బాబీ సినిమా టైటిల్ 'కదిరి' అంటూ లీక్ ఇచ్చేంత యాక్టివ్ గా ఉన్న ఆయన, విశ్వంభర రిలీజ్ ప్లాన్ గురించి సైలెంట్ గా ఉండటం ఫ్యాన్స్ లో డౌట్స్ పెంచుతోంది. ఈ సినిమా అప్డేట్స్ పై ఆయనెందుకు ప్రెజెంట్ క్లారిటీ ఇవ్వడం లేదనే చర్చ నడుస్తోంది.
అయితే చిరంజీవి ఈ ప్రాజెక్ట్ ను ఇగ్నోర్ చేస్తున్నారని లేదా సినిమాపై కాన్ఫిడెన్స్ లేదని అనుకోలేం. గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉండే సబ్జెక్ట్ కాబట్టి, టీమ్ నుంచి పక్కా కంటెంట్ వచ్చే వరకు వెయిట్ చేయడమే బెటర్ అని మేకర్స్ భావిస్తూ ఉండొచ్చు. కానీ సరైన టైమ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోతే బజ్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందోనని అభిమానులు ఆలోచనలో పడ్డారు.
బాబీ కొల్లి సినిమా లాంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ టైటిల్ వరకు 'చిరు లీక్' వస్తున్నప్పుడు, విశ్వంభర రిలీజ్ పై ఆడియన్స్ కి అసలైన క్లారిటీ కావాల్సి ఉంది. నెక్స్ట్ 'చిరు లీక్' కనుక విశ్వంభర అఫీషియల్ రిలీజ్ డేట్ లేదా ప్రమోషన్ల మీద వస్తే మెగా ఫ్యాన్స్ కి అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది? మరి ఆ గుడ్ న్యూస్ ను చిరంజీవి ఎప్పుడు చెప్తారో చూడాలి.