మ్యూజిక్ డైరెక్టర్ కి షాక్ ఇచ్చిన మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన `హిట్లర్` అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందే తెలిసిందే.;
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన `హిట్లర్` అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందే తెలిసిందే. సినిమా రిలీజ్ కు ముందే కోటి సంగీతం అందించిన అల్బమ్ అంతకు మించి సక్సెస్ అయింది. సినిమాలో ప్రతీ పాటకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రత్యేకించి `నడక కలిసిన నవరాత్రి..హబీబ్` సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది. రికార్డింగ్ డాన్సు లు...నాటకాల ట్రెండ్ లో రిలీజ్ అయిన చిత్రం కావడంతో? హబీబీ సాంగ్ అన్ని చోట్లా మారుమ్రోగేది. ఆపాటలో చిరంజీవి హుక్ స్టెప్స్ ఓ సంచలనం. కాంబినేషన్లో రంభ అదే రేంజ్ లో అలరించారు.
రిజెక్ట్ చేసిన సాంగ్ సూపర్ హిట్:
ఆ పాటలో ఇద్దరు ఒకే ఎనర్జీతో పోటా పోటీగా డాన్స్ చేసారు. సినిమాకే ఆ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే అలాంటి పాట మెగాస్టార్ కు నచ్చలేదు? అన్న సంగతి ఎంత మందికి తెలుసు? అవును ఈ విషయాన్ని కోటి తాజాగా రివీల్ చేసారు. ఆ పాటను చిరంజీవీ ఎంతగా ద్వేషించారు? అంటే ఆ పాట ఉంటే సినిమాలో నటించను అన్న రేంజ్లో పాటను చిరు రిజెక్ట్ చేసారు. `హిట్లర్` సాంగ్ ఎడిటర్ మోహన్ తో కలిసి కోటి పాట రికార్డింగ్ చేసారు. ఆ పాట విన్న తర్వాత చిరంజీవి ఫైనల్ చేయడమే ఆలస్యం. పాటపై నమ్మకంతో చిరంజీవి ఎలాగైనా ఒప్పుకుంటారు అన్న ధీమాతో కోటి టీమ్ ఉన్నారు.
చిరంజీవితో చేదు అనుభవం:
`ఆ పాట విని చిరంజీవి కోటి నీకు మంచి పేరు వస్తుంది. నేను చేయలేను ఈ పాటకు డాన్స్ అన్నారు. ఎంత కన్విన్స్ చేసినా ఒప్పుకోలేదు. దీంతో కోటి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.` అనంతరం ఎడిటర్ మోహన్ చూసి చెబుతామని నన్ను అక్కడ నుంచి తీసుకొచ్చేసారు. అప్పటికే ఆర్కిస్ట్రా టీమ్ రెడీగా ఉండటంతో వాళ్లకు విషయం చెప్పడం ఎందుకని డబ్బులిచ్చి పంపించేసాం. నేను చిరంజీవికి ఎన్నో పాటలు అందించాను. ఏ పాట విషయంలోనూ చిరంజీవి అలా స్పందించలేదు. దీంతో ఎందుకు నచ్చ లేదని బుర్ర పని చేయలేదు.
చెట్టు కింద విని ఒకే చేసారు:
ఆ పాట కోసం నేను ఎంతో కష్టపడ్డాను. అప్పుడే మోహన్ పాట మార్చకండి. క్యాచీ నెంబర్ అది. ఇంకా దీన్ని ఏం చేయగలరు? అన్నారని అడిగారు. ఆ తర్వాత రీ వర్క్ చేసాను. అప్పట్లో మీడియా ఆర్స్ట్ అని అద్భుతమైన రికార్డింగ్ థియేటర్ ఉండేది. అక్కడ రోజున్నర పాటు రికార్డింగ్ చేసాను. శ్రీధర్ అనే సౌండ్ ఇంజనీర్ మిక్స్ చేసాడు. అప్పటికే `హిట్లర్` షూటింగ్ మొదలైపోయింది. రీ వర్క్ అనంతరం ఆ పాట తీసుకెళ్లి మోహన్ చిరంజీవికి ఇచ్చారు. ఆ పాట చిరంజీవి చెట్టుకింద వింటూ లైట్ గా కాళ్లు ఊపడం మొదలు పెట్టారు. దీంతో విషయం అర్దమై మోహన్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు చిరంజీవికి నచ్చడంతో ఎంతో సంతోషంగా ఫీలయ్యాను. లారెన్స్ కి కొరియోగ్రాఫర్ గా చిరంజీవితో తొలి సాంగ్ అది` అని తెలిపారు.