మెగా ప్లానింగ్.. డబుల్ కాదు ట్రిపుల్ ఫీస్ట్..!
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టగా మెగా ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సినీ లవర్స్ కి ఇది సూపర్ ట్రీట్ ఇచ్చేలా ఉంది.;
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తర్వాత ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసే కంటెంట్ ఇవ్వాలని విశ్వంభర మొదలు పెట్టారు. ఐతే ఆ సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ వల్ల లేట్ అవుతుందని తెలిసి అనిల్ రావిపూడితో మన శంకర వరప్రసాద్ మొదలు పెట్టారు. మన శంకర వరప్రసాద్ 2026 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టగా మెగా ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సినీ లవర్స్ కి ఇది సూపర్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. మన శంకర వరప్రసాద్ సినిమాలో విక్టరీ వెంకటేష్ క్యామియో కూడా సినిమాకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెస్తుంది.
ఆడియన్స్ ని ఒక కొత్త ప్రపంచంలోకి..
ఇక ఈ సినిమాతో పాటు విశ్వంభర సినిమా కూడా నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ కాబోతుంది. సమ్మర్ లో విశ్వంభర స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని చూస్తుంది. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటించిన విశ్వంభర సినిమా ఆడియన్స్ ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది.
బాలయ్యతో డాకు మహారాజ్ లాంటి యాక్షన్ సినిమా చేసిన బాబీ ఈసారి మెగాస్టార్ తో కూడా మెగా మాస్ మూవీతో రాబోతున్నారట. ఈ సినిమా అనౌన్స్ మెంట్ పొస్టరే గొడ్డలితో రివీల్ చేసి సర్ ప్రైజ్ చేశారు. సో మెగా మాస్ మూవీగా చిరు, బాబీ సినిమా వస్తుంది. ఐతే ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ రిలీజ్ ఉంటుందట. 2023 లో వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో వచ్చిన చిరంజీవి మధ్యలో 2024, 25 రెండేళ్లు గ్యాప్ ఇచ్చారు. అందుకే 2026లో మెగాస్టార్ 3 సినిమాలు రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట.
బాబీ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్..
మన శంకర వర ప్రసాద్, విశ్వంభర ఓకే కానీ బాబీ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటుందా అంటే త్వరలో సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 2026 దసరా లేదా డిసెంబర్ రిలీజ్ చేసేలా చూడాలని మెగాస్టార్ చెబుతున్నారట. సో నెక్స్ట్ ఇయర్ మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ కాదు ట్రిపుల్ ఫీస్ట్ అది కూడా మూడు కూడా మూడు డిఫరెంట్ సినిమాలుగా రాబోతున్నాయని చెప్పొచ్చు.
ఐతే ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమా లైన్ లో ఉంది. ఆ సినిమాను నాని నిర్మిస్తున్నాడు. నానితో ది ప్యారడైజ్ చేస్తున్న శ్రీకాంత్ ఓదెల చిరంజీవితో సినిమాను నెక్స్ట్ సమ్మర్ మొదలు పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.