చిరు కోసం బాబి క్రేజీ ప్లాన్.. విలన్ ను బీటౌన్ నుంచి దింపుతున్నాడుగా

ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. తాజాగా ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు నటించనున్నారని టాక్ వినిపిస్తుంది.;

Update: 2025-10-28 12:31 GMT

మెగాస్టార్ చిరంజీవి- స్టార్ డైరెక్టర్ బాబి కొల్లి కాంబో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ కాంబోలో 2023లో రిలీజైన వాల్తేర్ వీరయ్య మంచి విజయం సాధించింది. మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత ఈ కాంబోలో సినిమా కుదిరింది. ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. తాజాగా ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు నటించనున్నారని టాక్ వినిపిస్తుంది.

బీ టౌన్ డైరెక్టర్ కమ్ నటుడు అనురాగ్ కశ్యప్ సినిమాలో భాగం కానున్నారని తెలిసింది. అది కూడా ఆయనకు బాబి విలన్ క్యారెక్టర్ రాసుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాలో అనురాగ్ కు పాత్ర ఉంటే.. ఆయనకు ఇదే తొలి తెలుగు సినిమా కానుంది. తొలి సినిమాతోనే తనదైన ఇంపాక్ట్ చూపించాలని అనురాగ్ కూడా భావిస్తున్నారు. అనురాగ్ గతేడాది కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.

మహారాజ సినిమాలో నెగెటివ్ పాత్ర పోషించారు. ఇందులో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో మెగాస్టార్ సినిమాలో ఆయనను తీసుకోవాలని.. బాబి డిసైడ్ అయ్యారు. అనురాగ్ నటనలో నేచురాలిటీ, ఇంపాక్ట్, స్క్రీన్ ప్రజెన్స్ చూసి సెట్ అవుతారని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో చిరుకు ఆపోజిట్ గా స్క్రీన్ పై అనుగార్ కనిపిస్తే విజిల్స్ పడడం ఖాయం. ఈ ఇద్దరి మధ్య యాక్షన్ సీన్స్ కు థియేటర్లలో పూనకాలే ఉంటాయనడంలో సందేహం లేదు.

బాబి ఇప్పటికే తెరకెక్కించిన వాల్తేర్ వీరయ్యలో చిరు క్యారెక్టరైజేషన్, కామెడీ టైమింగ్ అన్నీ ఎలిమెంట్స్ చూపించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం సినిమాలో హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఇందులో కూడా అలాంటిదే ప్లాన్ చేస్తే వేరే లెవెల్ లో ఉంటుంది. మరి అనురాగ్ ను బాబి ఏ విధంగా వాడుకుంటారో చూడాలి. కాగా, ఈ సినిమాలో చిరుతోపాటు మరో హీరో కూడా ఉంటారని టాక్ వినిపిస్తుంది. ఈ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో కార్తి ని అనుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మెగా 158 వర్కింగ్ టైటిల్ గా ఇధి పట్టాలెక్కనుంది. వచ్చే నెల ఆఖరి లేదా డిసెంబర్ తొలి వారంలో షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలి షెడ్యూల్ లోనే అనురాగ్ షూటింగ్ లో పాల్గొంటారని టాక్ నడుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Tags:    

Similar News