వాల్తేరు వీరయ్య లానే మెగా158లో కూడా..
ఈ నేపథ్యంలోనే ఎన్నో జానర్లలో పలు సినిమాలొచ్చాయి. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మరో హీరో నటించనున్నట్టు తెలుస్తోంది.;
సినీ ఇండస్ట్రీలో ఒకరి సినిమాల్లో మరొకరు గెస్ట్ రోల్స్ చేయడం, వేరే హీరో సినిమాలో మరో హీరో కీలక పాత్రలో కనిపించడం లేదంటే ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమా చేయడం ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎన్నో జానర్లలో పలు సినిమాలొచ్చాయి. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మరో హీరో నటించనున్నట్టు తెలుస్తోంది.
వాల్తేరు వీరయ్యతో బ్లాక్‌బస్టర్
ప్రస్తుతం విశ్వంభర, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఈ రెండు సినిమాల తర్వాత బాబీతో తన 158వ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య సినిమా రాగా ఆ సినిమా బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. వాల్తేరు వీరయ్య తర్వాత చిరూ- బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది.
వాల్తేరు వీరయ్యకు ప్రాణం పోసిన రవితేజ
మెగా158గా రూపొందనున్న ఈ సినిమాను బాబీ ఓ మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దనుండగా, ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బాబీ బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం ఆఖరికి ఈ మూవీ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో యంగ్ హీరో కీలక పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. గతంలో చిరూ- బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్యలో కూడా ఇదే జరిగింది. ఆ సినిమా సెకండాఫ్ లో వచ్చే రవితేజ క్యారెక్టర్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచింది.
ఆ పనిలో బాబీ బిజీ
ఇప్పుడు వాల్తేరు వీరయ్య లానే ఈ సినిమాలో కూడా బాబీ ఓ స్ట్రాంగ్ క్యారెక్టర్ ను రాసుకున్నారని, ఆ క్యారెక్టర్ కోసం సరైన యాక్టర్ ను వెతికే పనిలో బాబీ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. అయితే బాబీ ఆ యాక్టర్ ను తెలుగు నుంచే తీసుకుంటారా లేకా ఇతర భాషల నుంచి తీసుకుంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు.