‘నేనెందుకయ్యా మీ మధ్య’ చిరంజీవి కామెడీ టైమింగ్ వైరల్..!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా ‘మెగా 158’ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా మొదలైంది.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా ‘మెగా 158’ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా మొదలైంది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, ఈ ఈవెంట్‌లో చిరంజీవి తన మార్క్ కామెడీ టైమింగ్‌తో చేసిన కొన్ని సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఆ నవ్వుల హంగామా గురించి చూద్దాం..
దేవుడు, భక్తుడు.. మధ్యలో అగరబత్తీ:
సినిమా ఓపెనింగ్ వేడుకకు పవన్ కళ్యాణ్‌తో పాటు నిర్మాత బండ్ల గణేశ్ కూడా హాజరయ్యారు. పవన్ పక్కన నిలబడిన బండ్ల గణేశ్, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఒక ఫొటో దిగాలని రిక్వెస్ట్ చేశారు. దానికి చిరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. "నేనెందుకయ్యా మీ మధ్య.. దేవుడికి, భక్తుడికి మధ్య అనుసంధానం అగరబత్తీలాగా!" అంటూ నవ్వుతూ కౌంటర్ వేశారు. ఇక పవన్‌ను దేవుడిగా కొలిచే బండ్లపై చిరు వేసిన ఈ పంచ్‌తో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు.
సోషల్ మీడియాలో వైరల్ క్లిప్:
చిత్ర యూనిట్ విడుదల చేసిన “ది స్పిరిట్ ఆఫ్ మెగా 158” ప్రత్యేక వీడియోలో ఈ సన్నివేశం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చిరంజీవి కామెడీ టైమింగ్, ఆ సమయస్ఫూర్తిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "మెగాస్టార్ టైమింగ్ వేరే లెవెల్ అంతే!" అంటూ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. దీనితో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
క్రేజీ కాంబినేషన్.. భారీ అంచనాలు:
గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై అందరిలోనూ భారీ ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తోంది. ఇక అలాగే ఈ సినిమాలో అనస్వర రాజన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా, క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. సినిమా ప్రారంభంలోనే మెగాస్టార్ తన కామెడీతో ఇంతటి హంగామా సృష్టిస్తే, ఇక వెండితెరపై బాబీ చూపించబోయే మాస్ ఎలిమెంట్స్ ఏ రేంజ్‌లో ఉంటాయోనని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి మరిన్ని క్రేజీ అప్‌డేట్స్ రావడం ఖాయం.