మెగా మూవీ లో విలన్ అతడు కాదా?
ఇప్పటికే కొంత మంది కథానాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే విలన్ గా యంగ్ హీరో కార్తికేయ గుమ్మడికొండను తీసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి.;
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా నటీనటుల ఎంపి కపై టీమ్ దృష్టి పెట్టింది. ఇప్పటికే కొంత మంది కథానాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే విలన్ గా యంగ్ హీరో కార్తికేయ గుమ్మడికొండను తీసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి.
కార్తికేయకు ఈ ఛాన్స్ చిరంజీవి పిలిచి మరీ ఇచ్చారని వినిపించింది. చిరంజీవి అంటే కార్తికేయకు ఎంత అభిమానమో పబ్లిక్ గా ఓ ఈవెంట్ లో ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. అలాగే కొంత కాలంగా చిరు తన సినిమాల్లో కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఈనేపథ్యంలో తన సినిమాలో కార్తికేయ విలన్ అయితే బాగుంటుందని అనీల్ కి రిఫర్ చేసినట్లు..వెంటనే ఎంపిక చేసినట్లు ప్రచారంలోకి వచ్చింది.
అయితే ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కార్తికేయకు ఈ ఛాన్స్ రాలేదని అంటున్నారు. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో ప్రచారం తప్ప ఎలాంటి ఆధారం లేని వార్తగా తెరపైకి వస్తోంది. అలాగే హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా ఏవీ వాస్తవాలు కావంటున్నారు. మరి ఇవి వాస్తవాలా? అవాస్తవాలా? అన్నది తేలాలంటే మేకర్స్ స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు.
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పడుతుంది. సీజీ పనులు ఇతర దేశాల్లో జరుగుతన్నా ఓ కొలిక్కి రావడం లేదు. చిరంజీవి ఈ సినిమాకి సంబంధించి డబ్బింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది.