మెగా నారా కాంబో.. టాక్ ఏంటి?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎంతో మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో యంగ్ హీరో నారా రోహిత్ తనదైన నటన, యాక్షన్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎంతో మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో యంగ్ హీరో నారా రోహిత్ తనదైన నటన, యాక్షన్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటిది ఆ ఇద్దరూ తొలిసారి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? పైగా అది సినిమా క్లైమాక్స్ లో జరిగే పవర్ ఫుల్ ఎంట్రీ అయితే ఇంకెలా ఉంటుంది? ప్రస్తుతం ఇదే చర్చ జోరుగా సాగుతోంది.
దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న మెగా 158లో నారా రోహిత్ కీలక గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఆ వార్తపై మూవీ టీమ్ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో కథను మరో స్థాయికి తీసుకెళ్లే పాత్ర కోసం నారా రోహిత్ ను తీసుకొచ్చే ఆలోచన ఉందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే అభిమానులకు ఇది పెద్ద సర్ప్రైజ్ గా మారే అవకాశం ఉంది.
అయితే చిరంజీవి, బాబీ కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో ప్రత్యేక అంచనాలు ఉంటాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుండటంతో అంచనాలు పెరిగాయి.
ఈసారి బాబీ మరింత స్ట్రాంగ్ స్టోరీతో వస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్ కు పెద్దపీట వేస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా ప్యారలల్ గా మిక్స్ చేసినట్లు సమాచారం. చిరంజీవి పాత్ర కూడా కొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా నిలవబోతుందనే టాక్ వినిపిస్తోంది.
ఆ ఫ్లాష్ బ్యాక్ కోసం చిరంజీవి పూర్తిగా కొత్త లుక్ లో కనిపించనున్నారనే వార్తలు ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. అంతేకాకుండా పాత్రలో వేరియేషన్స్, ఎమోషన్స్ పరంగా కూడా కొత్తదనం ఉండబోతుందని సమాచారం. చిరంజీవి గత చిత్రాల్లో కనిపించని కొన్ని షేడ్స్ ఆ సినిమాలో చూడొచ్చని వినికిడి. ఇలాంటి సమయంలో క్లైమాక్స్ లో నారా రోహిత్ ఎంట్రీ ఉంటే కథకు మరింత బలం చేకూరే అవకాశముంది.
ముఖ్యంగా యాక్షన్, ఇంటెన్స్ పాత్రల్లో తన స్పెషాలిటీ ప్రూవ్ చేసుకున్న నారా రోహిత్.. చిరంజీవితో కలిసి కనిపిస్తే ఆ సన్నివేశాలకు మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, నటన, డైలాగ్ డెలివరీ కలిస్తే క్లైమాక్స్ మరింత ఎలివేట్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎక్కడా రాజీ లేకుండా సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా నారా రోహిత్, చిరు కాంబో నిజమో కాదో అంతా వేచి చూడాలి.