• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కడ గాలిలోనే మ్యూజిక్:...

అక్కడ గాలిలోనే మ్యూజిక్: మణిశర్మ

| కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' మ్యూజికల్ ఫెస్ట్ తిరుపతిలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ ఈవెంట్ లో చాలా తక్కువగా, సింపుల్ గా మాట్లాడారు.

By - M Prashanth
Update: 2026-06-21 04:59 GMT

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' మ్యూజికల్ ఫెస్ట్ తిరుపతిలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ ఈవెంట్ లో చాలా తక్కువగా, సింపుల్ గా మాట్లాడారు. ఆయన తన స్పీచ్ లో చెన్నైతో తనకున్న అనుబంధాన్ని, ఈ సినిమా మ్యూజిక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఇటీవల కాలంలో మణిశర్మ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మంచి కంటెంట్ ఉన్న డిఫరెంట్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. టాలీవుడ్ లోని దాదాపు స్టార్స్ అందరితో వర్క్ చేసిన అనుభవం ఉంది. ఇక చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా మంచి మెలోడీస్ ఇవ్వడంలో ఆయన స్టైలే వేరు. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం మరో హైలెట్. ఈవెంట్ లో ఆయన మాట్లాడిన విధానం అందరిని ఆకట్టుకుంది.

ముందుగా ఆయన మాట్లాడుతూ.. చెన్నై అంటే తనకు చాలా ఇష్టమని, తాను చెన్నైలోనే పుట్టి పెరిగానని చెప్పారు. అక్కడే మ్యూజిక్ నేర్చుకున్నానని, అక్కడే స్టూడియో కట్టానని, అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగానని తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నై అనే పేరుతో తనకు చాలా దగ్గరి సంబంధం ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే, చెన్నైలో గాలిలోనే మ్యూజిక్ ఉంటుందని ఆయన ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అది తను స్వయంగా అనుభవించానని ఆయన చెప్పారు. అలాంటి ఒక అద్భుతమైన మ్యూజిక్ ను ఈ సినిమాలో వింటారని ఆయన నమ్మకంగా చెప్పారు.

తన గురువు గారు ఇళయరాజా గారి గురించి మాట్లాడుతూ.. ఆయన కూడా చెన్నైలోనే తన సంగీత ప్రయాణాన్ని సాగించారని, ఆయనొక అద్భుతమని మణిశర్మ కితాబిచ్చారు. 'చెన్నై లవ్ స్టోరీ' అంటే చెన్నైలాగే అద్భుతమైన ఒక బ్రీజ్ లాంటి మంచి పాటలను రవి నంబూరి, సాయి రాజేష్ దగ్గరుండి చేయించుకున్నారని ఆయన అన్నారు. ఈ సినిమాలోని పాటలు చాలా బాగా వచ్చాయని, అవి ప్రేక్షకులకు నచ్చుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో ఎస్కేఎన్, కిరణ్, సాయి రాజేష్ అందరూ చాలా అద్భుతంగా పని చేశారని, సినిమా చాలా సక్సెస్ సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాలోని ఒక పాటను తన ముందు తిరుపతిలో రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఏడుకొండల వాడి పాదాల దగ్గర అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఆయన తన స్పీచ్ ను ముగించారు.

Tags:    
  • manisharma 
  • kiranabbavaram 
  • chennailovestory 
  • srigouripriya 
  • tollywood 
  • telugucinema 
  • skn 
  • tirupati 

Similar News

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS