ఓవర్ కాన్పిడెన్స్ తో వాగుతున్నా అనుకున్నారు!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన `చంద్రముఖి` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రజనీకాంత్ కెరీర్ లో ఇదో మైల్ స్టోన్ చిత్రం.;
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన `చంద్రముఖి` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రజనీకాంత్ కెరీర్ లో ఇదో మైల్ స్టోన్ చిత్రం. హారర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాకు తమిళ, తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అప్పట్లో చంద్రముఖి మేనియా ఓ రేంజ్ లో కొనసాగింది. థియేట్రికల్ సక్సస్ తో పాటు మ్యూజికల్ గానూ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రత్యేకించి వారాయి పాట పెద్ద హిట్ అయింది. తెలుగు వెర్షన్ పాటను తమిళ్ లో...తమిళ్ వెర్షన్ పాటను తెలుగులో పెట్టి రిలీజ్ చేయడం అదే తొలిసారి. రెండు భాషలకు ఆ పాట బాగా కనెక్ట్ అయింది. సంగీతానికి భాష అవసరం లేదని ఆ పాటతో మరోసారి రుజువైంది.
మనసులో అలా అనుకునే ఉంటారు:
ఈ సినిమాకు సంగీతం అందించింది విద్యాసాగర్. ఈ నేపథ్యంలో ఆనాటి మ్యూజిక్ సంగతుల్ని విద్యాసాగర్ తాజాగా పంచుకున్నారు. `35 ఏళ్లగా సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నా. ఇన్నేళ్ల ప్రయాణంలో రజనీకాంత్ గారితో కలిసి పనిచేసే అవకాశం ఒక్క సినిమాకే వచ్చింది. అదే `చంద్రముఖి`. ఈసినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో రజనీకాంత్ పాల్గొన్నారు. అప్పుడే ఆయన రెండు పాటలు తప్పకుండా హిట్ చేయాలని అన్నారు. నేను ఐదు పాటలు హిట్ చేద్దాం. అవి జనాల్లోకి బలంగా వెళ్లాలి చాలా కాన్పిడెంట్ గా చెప్పాను. ఆ మాట విన్న రజనీగారు నా వైపు ఒకలా చూసారు. ఓవర్ కాన్పిడెన్స్ తో మాట్లాడుతున్నానని మనసులో అనుకునే ఉంటారు. నేను మాత్రం కాన్పిడెంట్ గా ఉన్నాను.
తమిళ్ లో సంచలనమైన సాంగ్:
పాటలన్నీ హిట్ అవ్వాలని దేవుణ్ని కోరుకున్నాను. కట్ చేస్తే సినిమా రిలీజ్ అనంతరం అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రజనీకాంత్ గారు చాలా సంతోషంగా కనిపించారు. 200 రోజుల వేడుక సమయంలో స్టేజ్ పై ఆయన నా గురించి చెప్పారు. `రా రా` అనే పాట, తమిళనాడు అంతటా మారుమ్రోగిన ఏకైక తెలుగు పాటగా నిలిచింద`న్నారు. కొన్ని చిత్రాల్లో కొన్ని పాటలు ఐకానిక్ గా నిలిచిపోతాయి. ఏ పాట విజయం సాధిస్తుంది? ఏ పాట విజయం సాధించదు అన్నది సినిమా ఫలితం లాగే ముందే అంచనా వేయలేం. కొన్నిసార్లు అంచనా వేసిన పాటలు ఫెయిలవుతుంటాయి. అనుకోని పాటలు సక్సెస్ అవుతుంటాయి. ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనైనా ఇది జరగుతుంది.
చికిరితోనూ అదే మ్యాజిక్:
రీసెంట్ గా రిలీజ్ అయిన రెహమాన్ సాంగ్ `చికిరి చికిరి` అంత పెద్ద హిట్ అవుతుందని రెహమాన్ అండ్ కో కూడా ఊహించలేదు. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే చార్ బస్టర్ అయింది. మెగాస్టార్ చిరంజీవి పాట రికార్డులనే తిరగరాసింది. చికిరి సాంగ్ ఐడియా అప్పటికప్పుడు వచ్చింది. డైరెక్టర్ బుచ్చిబాబు సాంగ్ సిచ్వేషన్ చెప్ప డం..దాన్ని ఆధారంగా చేసుకుని రెహమాన్ హమ్ చేయడం ట్యూన్ కట్టడం వేగంగా జరిగిపోయాయి.