చాయ్ వాలా ఫస్ట్ లుక్: మరో హ్యూమన్ టచ్ స్టోరీ
సినిమాలో హైదరాబాద్ నగర జీవనాన్ని, మధ్య తరగతి ఫీలింగ్స్‌ని హైలెట్ చేశారని పోస్టర్‌లోనే కనిపిస్తోంది. ఈ పోస్టర్ రీలీజ్‌తో సినిమాలో ఉండే వాతావరణాన్ని, క్యారెక్టర్ల మధ్య ఉండే రిలేషన్‌ని హింట్‌గా చూపించారు.;
కథల్లో కొత్తదనాన్ని వెతుక్కునే యంగ్ హీరోలకు ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఆడియెన్స్ సపోర్ట్ ఉంటుంది. ఇక అదే తరహాలో వెళుతున్న వారిలో శివ కందుకూరి ఒకరు. తన కథల ఎంపికల్లో కూడా అదే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అతను నటిస్తున్న చిత్రం ‘చాయ్ వాలా’ కూడా పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు నిర్మిస్తుండగా, ప్రమోద్ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమాలో హైదరాబాద్ నగర జీవనాన్ని, మధ్య తరగతి ఫీలింగ్స్‌ని హైలెట్ చేశారని పోస్టర్‌లోనే కనిపిస్తోంది. ఈ పోస్టర్ రీలీజ్‌తో సినిమాలో ఉండే వాతావరణాన్ని, క్యారెక్టర్ల మధ్య ఉండే రిలేషన్‌ని హింట్‌గా చూపించారు. నగరంలోని చార్మినార్, క్లాసిక్ స్కూటీ ఫీల్‌తో, ఇద్దరూ వెనక్కి తలా వాలుతూ నవ్వుకుంటూ కనిపించడం సినిమాకు ఓ హ్యూమన్ టచ్ తీసుకొచ్చింది. రాజీవ్ కనకాలతో శివ కందుకూరి చేసిన ఈ కామెడీ ప్రయాణం జెన్యూయిన్ గా కనెక్ట్ అవుతుందని అనిపిస్తోంది.
ఇదే పోస్టర్‌లో టీజర్ అతి త్వరలో వస్తుంది అని అధికారికంగా ప్రకటించారు. ఈ కథ ప్రేమ, వారసత్వం అంశాల చుట్టూ తిరుగుతుంది, భావోద్వేగాలు, సంప్రదాయం, కలలతో నిండిన ఓ ప్రయాణం అని మేకర్స్ చెప్పడం సినిమాకు ప్రత్యేకతను ఇచ్చింది. పోస్టర్ అప్డేట్ తో కథని ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం టీజర్‌పై ఫోకస్ నెలకొంది.
టెక్నికల్‌గా ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం, క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి స్ట్రెంగ్త్ అవుతాయని చెబుతున్నారు. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఓ కూల్ ఫీల్ గుడ్ మూవీయే కానుందన్న హింట్ స్పష్టంగా కనిపిస్తోంది. రెగ్యులర్ సినిమాల్లో కనిపించే రొటీన్ మసాలా గమనాన్ని తప్పించుకుని, సున్నితమైన భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మూవీ యూనిట్ ఆలోచన స్పష్టంగా తెలుస్తోంది.
ఈమధ్య కాలంలో ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాల కోసమే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. సింపుల్ హ్యూమన్ స్టోరీలు నచ్చే ప్రేక్షకులకు ‘చాయ్ వాలా’ కొత్త రుచిని ఇస్తుందనిపిస్తోంది. ఇక మిడిల్ క్లాస్, ఫ్యామిలీ ప్రేమ, కలల మధ్య జరిగే ఈ జర్నీ మూడ్‌ను టీజర్ ఏ రేంజ్‌లో చూపించబోతుందో చూడాలి.