• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతూ-శోభిత .. మూడు...

చైతూ-శోభిత .. మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట

| చైతూ-శోభిత బంధం ఇప్పటివరకు మీడియా హడావుడి లేకుండా కొనసాగినప్పటికీ, ఇప్పుడు వారి పెళ్లి వేడుక ఘనంగా వైరల్ అవుతోంది.

By - Tupaki Desk
Update: 2024-12-04 15:23 GMT

అక్కినేని నాగచైతన్య శోభిత దూళిపాళ్ల వివాహం ఘనంగా, ఆడంబరంగా జరిగింది. హైదరాబాద్లోని ప్రసిద్ధ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ANR విగ్రహం ముందు నిర్వహించిన ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైన ఈ వేడుకలు హిందు సాంప్రదాయానికి తగ్గట్టుగా జరిగాయి. చైతూ-శోభిత బంధం ఇప్పటివరకు మీడియా హడావుడి లేకుండా కొనసాగినప్పటికీ, ఇప్పుడు వారి పెళ్లి వేడుక ఘనంగా వైరల్ అవుతోంది.

చైతన్య సంప్రదాయ పంచలో, శోభిత పసుపు బంగారు కాంబినేషన్ కలిగిన చీరలో కనిపించి అందరినీ మెప్పించారు. వధువు ధరించిన ఆభరణాలు, చీర నిండా గాజుల నడుమ ఆడంబరంగా కనిపించింది. పెళ్లి వేడుకలో వారి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. వధూవరుల మధ్య ఉన్న సింప్లిసిటీ, వారిద్దరి సమన్వయం, ఆనందం ప్రతి ఫోటోలో కనిపిస్తోంది.

వివాహానికి సంబంధించిన ప్రత్యేకమైన మూహూర్తం రాత్రి 8:15 గంటలకు నిర్ధారించగా, ఆ సమయానికి వేద మంత్రాల మధ్య ఈ జంట ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకకు ముందు మంగళ స్నానం, హల్దీ వంటి సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలు మరింత ఆనందంగా జరిగాయి. వివాహ వేడుక అనంతరం ఈ జంట తిరుమల లేదా శ్రీశైలం వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారని సమాచారం.

పెళ్లి సందర్భంగా నాగచైతన్య తన తాత ANR స్టైల్‌లో సంప్రదాయ పంచలో దర్శనమిచ్చారు. దీనికి అభిమానులు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. చైతూ తన తాత ANR కు నివాళిగా తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కుటుంబ సంప్రదాయాల పట్ల చూపిన గౌరవాన్ని స్పష్టం చేస్తోంది. మంగలస్నానం దగ్గరి నుండి, శోభిత చేతుల్లో పసుపు కలశం వరకు ప్రతి మూమెంట్ ఫోటోల రూపంలో నెట్టింట హైలైట్ అవుతోంది.

ఈ పెళ్లి వేడుకలో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు అలాగే మరికొందరు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని జంటను ఆశీర్వదించారు. ప్రముఖ దర్శకులు, హీరోలు, రాజకీయ నాయకులు, మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు కూడా వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక చైతూ-శోభిత కొత్త జీవిత ప్రయాణానికి అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    
  • Chaisobhitawedding 
  • Nagachaitanya 
  • Sobhitadhulipala 
  • Annapurnastudios 
  • Nagarjuna 
  • ANR 
  • Weddingceremony 
  • Ramcharan 
  • Chiranjeevi 
  • Ranadaggubati 
  • Daggubatifamily 
  • Virallooks 
  • Socialmedia 

Similar News

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

Copyright @2026

Powered by Blink CMS