టాప్ స్టోరి: స్టార్ల అందాలకు బిలియన్ డాలర్ బీమా
నిజం చెప్పాలంటే సెలబ్రిటీలకు కీర్తి, సంపదల్లో ఎక్కువ భాగం దేని నుంచి వస్తుంది? అంటే అది వారి అందం- ఆకర్షించే స్వభావం నుంచి వస్తుంది.;
నిజం చెప్పాలంటే సెలబ్రిటీలకు కీర్తి, సంపదల్లో ఎక్కువ భాగం దేని నుంచి వస్తుంది? అంటే అది వారి అందం- ఆకర్షించే స్వభావం నుంచి వస్తుంది. సంపద సృష్టికి `అందం` చాలా ముఖ్యం. సెలబ్రిటీల శరీర భాగాలు వారి కెరీర్‌కు కీలకమైనవి కాబట్టి, ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే ఇంతటి అందాలకు రక్షణ ఉండాలి కదా!
అందుకే తమ అందానికి అవసరమైన తమ శరీర భాగాలను కాపాడుకోవడానికి సెలబ్రిటీలు మల్టీ బిలియన్ డాలర్ బీమా పాలసీలు తీసుకోవడం సాధారణంగా మారింది. ఒక్కోసారి మీసాలకు, ముఖానికి, కళ్లకు లేదా పిరుదులకు కూడా బీమా చేయించుకుంటున్న స్టార్లు ఉన్నారు. కెరీర్ సంబంధ ప్రమాదాలు లేదా గ్రహాంతర వాసులు ఎత్తుకెళ్లిపోతారనే భయంతో బీమా కావచ్చు...మొత్తానికి బీమాను సెలబ్రిటీలు అస్సలు విస్మరించరు.
అంబానీ పెళ్లిలో సందడి చేసిన అమెరికన్ సెలబ్రిటీ కిమ్ కర్దాషియాన్ ఇప్పుడు భారతదేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు తెలుసు. కిమ్ బ్యాక్ షేప్స్ చాలా స్పెషల్. అందువల్ల సహజంగానే కర్ధాషియన్ ఈ అందాలకు బీమా చేయించిందని హాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. 3 మిలియన్ల డాలర్ల నుండి 21 మిలియన్ల డాలర్ల వరకు బీమా విలువ మారుతుంది. ప్రముఖ పాప్ గాయని మడోన్నా తన ఛాతీని 2 మిలియన్ డాలర్లకు బీమా చేయించుకుంది.
గాయని టేలర్ స్విఫ్ట్ తన కాళ్లకు 40 మిలియన్ డాలర్ల బీమా పాలసీ తీసుకుంది. పాప్ గాయని రిహన్న జిల్లెట్ `సెలబ్రిటీ లెగ్స్ ఆఫ్ ఎ గాడెస్` బిరుదు లభించిన తర్వాత ఆ కాళ్లను రక్షించడానికి తన కంపెనీ సౌజన్యంతో 1 మిలియన్ డాలర్ బీమా పాలసీని పొందింది. `క్వాంటమ్ ఆఫ్ సొలేస్` చిత్రీకరణ సమయంలో జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెయిగ్ తన మొత్తం శరీరాన్ని 9.5 మిలియన్ డాలర్లకు బీమా చేయించుకున్నాడు.
ఒక సూపర్ మోడల్‌గా హైడీ క్లమ్ కాళ్ళకు 2 మిలియన్ డాలర్ల బీమా పాలసీని చేయించుకుంది. ప్రముఖ పాప్ గాయని మిలీ సైరస్ తన నాలుకను 1 మిలియన్ డాలర్లకు బీమా చేసిందని పుకార్లు వచ్చాయి. హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ తన అద్భుతమైన స్మైల్‌ను 30 మిలియన్ డాలర్లకు బీమా చేయించుకుంది. కిస్ బ్యాండ్‌తో తన కెరీర్‌లో అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రఖ్యాత రాకర్ తన నాలుకను 1 మిలియన్ డాలర్లకు బీమా చేయించుకున్నాడు. డాలీ పార్టన్ అనే గాయని చాలా ప్రతిభతో ఆకర్షిస్తుంది. తన ఛాతీ అందాలను ఒక్కో వైపున 600,000 డాలర్లు, 300,000 డాలర్లకు బీమా చేయించుకుంది. తమ శరీర భాగాలకు బీమా చేయించుకున్న ప్రముఖుల్లో క్రీడాకారులు ఉన్నారు. రొనాల్డినో, బెక్ హామ్ లాంటి ప్రముఖులు తమ శరీర భాగాలకు బీమా చేయించుకున్నారు.