ఇప్పుడైనా ఆ హీరోయిన్ కోరిక నెరవేరుతుందా?
ఇద్దరమ్మాలుతో మూవీలో చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి, తన అందం, యాక్టింగ్ తో అందరి మనసుల్నీ గెలిచేసిన భామే కేథరిన్.;
మామూలుగా ఎవరికైనా అదృష్టమనేది ఒకసారే తలుపు తడుతుంది. అది సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా. కానీ అందాల భామ కేథరిన్ థ్రెసాకు మాత్రం ఆ అదృష్టం రెండోసారి కూడా తలుపు తట్టింది. కేథరిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పన్లేదు. ఇద్దరమ్మాలుతో మూవీలో చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి, తన అందం, యాక్టింగ్ తో అందరి మనసుల్నీ గెలిచేసిన భామే కేథరిన్.
ఆ తర్వాత కేథరిన్ పలు సినిమాల్లో నటించినప్పటికీ ఏ సినిమా తనని స్టార్ హీరోయిన్ ను చేయలేకపోయింది. టాప్ లేచిపోద్ది సాంగ్ లో బన్నీతో కలిసి ఓ రేంజ్ స్టెప్పులేసి తన డ్యాన్సులతో అందరినీ అలరించిన కేథరిన్ ఎప్పటికప్పుడు తన లక్ ను టెస్ట్ చేసుకుంటూనే ఉన్నారు. అందులో భాగంగానే వచ్చిన ప్రతీ అవకాశాన్నీ అందుకుని కెరీర్లో ముందుకెళ్తున్నారు.
గతంలో మిస్ అయిన చిరు అవకాశం
ఇక అసలు విషయానికొస్తే కేథరిన్ కు గతంలో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నెం.150లో ఐటెమ్ సాంగ్ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చే చేజారింది. ఆ ఐటెమ్ సాంగ్ ను కేథరిన్ కు బదులు లక్ష్మీ రాయ్ తో చేయించారు. అప్పుడు ఛాన్స్ కోల్పోయినా సరే కేథరిన్ కు ఇప్పుడు మరోసారి చిరూ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ను అందుకున్నారు.
మన శంకరవరప్రసాద్ గారు లో కీలక పాత్ర
చిరంజీవి తాజా సినిమా మన శంకరవరప్రసాద్ గారు మూవీలో కేథరిన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై కేథరిన్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. మరి అప్పట్లో మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసే అవకాశాన్ని కోల్పోయిన కేథరిన్ కు ఈ మూవీలో ఏమైనా చిరూతో కలిసి కాలు కదిపే ఛాన్సొస్తుందేమో చూడాలి. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.