• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వచ్చేది డైనోసార్​ ధనుష్.....

వచ్చేది డైనోసార్​ ధనుష్.. రిస్క్​ వద్దు!

| ఈ ఏడాది మిగిలిపోయిన మోస్ట్ అవైటెడ్​ సినిమాల్లో ప్రభాస్ సలార్​ - షారుక్ డంకీ. డిసెంబర్ మూడో వారంలో ఇవి రిలీజ్​కు రెడీగా ఉన్నాయి

By - Tupaki Desk
Update: 2023-10-03 00:30 GMT

ఈ ఏడాది మిగిలిపోయిన మోస్ట్ అవైటెడ్​ సినిమాల్లో ప్రభాస్ సలార్​ - షారుక్ డంకీ. డిసెంబర్ మూడో వారంలో ఇవి రిలీజ్​కు రెడీగా ఉన్నాయి. సినీ ప్రియుల దృష్టంతా ఈ రెండు చిత్రాల మీదే ఉంది. దీంతో ఈ రెండు చిత్రాలకు అటు ఇటు కొద్ది రోజుల వరకు ఏ సినిమాలు వచ్చేందుకు సాహసం చేయవు! కానీ ధనుశ్​ పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్ మాత్రం విడుదల సాహసానికి సిద్ధంగా ఉంది.

డిసెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాస్తవానికి ఈ చిత్రం విడుదల తేదీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అప్పటికీ షారుఖ్ ఖాన్ డంకీ మాత్రమే డిసెంబర్​ రిలీజ్​కు కన్ఫార్మ్ అయ్యింది. బాలీవుడ్ చిత్రం కావడంతో మిల్లర్​ మేకర్స్​.. పెద్ద పోటీగా భావించలేదు.

కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అనూహ్యంగా సలార్ వచ్చి డిసెంబర్​ మూడో వారానికి చేరింది. పైగా రీసెంట్​గానే జవాన్​తో మరో రూ.1000కోట్ల హిట్​ను అందుకున్నారు షారుక్​. అంటే ఇప్పుడు సలార్​ - డంకీకి విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. మరి ఇలాంటి సమయంలో కేవలం వారం రోజుల వ్యవధిలో ముందుగా వచ్చి.. మిల్లర్.. పైసా వసూలు చేయడం సాధ్యమేనా అంటే చెప్పడం కాస్త కష్టమే.

గతంలో... 2018 డిసెంబర్​లో ధనుశ్​ 'మారి 2' రిలీజ్ చేసినప్పుడు.. అప్పుడు పోటీగా.. షారుక్​ ఖాన్ జీరో, యష్ కేజీయప్​ ఛాప్టర్ 1, మోహన్ లాల్ ఒడియన్, అక్వమెన్ వంటివి ఉన్నాయి. అయినా కూడా 'మారి 2' కమర్షియల్​గా మంచి సక్సెస్​ను అందుకుంది. ఇప్పుడు కూడా అలాంటి సీన్ రిపీట్​ అవుతుందనే ధీమాతో సినిమా రిలీజ్​ చేస్తే.. కష్టమే! ఎందుకంటే ఈ సారి పోటీగా వచ్చేది డైనోసార్​. తక్కువ అంచనా వేయలం. కాబట్టి.. మిల్లర్​ ఫైనల్ డెసిషన్​ చాలా క్యాలికులేషన్లపై ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ ఢీ కొట్టేందుకు రెడీ అయిందా.. తమిళంలో ఓకే కానీ ఇతర భాషల్లో కష్టాలు తప్పవు. ఇకపోతే ఈ పీరియాడిక్ డ్రామాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్, కన్నడ స్టార్​ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ ఆకట్టుకుంది.

Tags:    
  • Captainmillermovie 
  • Dhanush 
  • Salaarmovie 
  • Prabhas 
  • Dunkimovie 
  • Shahrukhkhan 
  • Filmindustry 
  • Decembermovies 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS