• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌ధ్య‌లో ఆగిపోయిన చిత్రం...

మ‌ధ్య‌లో ఆగిపోయిన చిత్రం 2026లో రీస్టార్ట్!

| బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస విజయాల‌తో టైర్ 2 హీరోల్లో ముందున్నాడు.

By - Srikanth Kontham
Update: 2025-08-14 21:30 GMT

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస విజయాల‌తో టైర్ 2 హీరోల్లో ముందున్నాడు. `చందు ఛాంపియ‌న్`, `భూల్ భుల‌య్య 3` లాంటి విజ‌యాల‌తో కార్తీక్ స్టార్ డ‌మ్ రెట్టింపు అయింది. ప్రస్తుతం రెండు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి మ్యూ జిక‌ల్ రొమాంటిక్ చిత్రం కాగా, మ‌రోటి `తూ మేరి మేయిన్ తేరా మెయిన్ తేరా తూ మేరీ` చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. రెండు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌ధ్య‌లో ఆగిపోయిన చిత్రం సైతం తిరిగి ప‌ట్టాలెక్క‌డానికి రెడీ అవుతోంది.

కార్తీక్ ఆర్య‌న్ హీరోగా హ‌న్స‌ల్ మెహ‌తా ద‌ర్శ‌క‌త్వంలో `కెప్టెన్ ఇండియా` చిత్రం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా రెగ్యుల‌ర్ షూటింగ్ కి స‌న్నాహాకాలు చేస్తోన్న స‌మ‌యంలో అనూహ్యంగా ప్రాజెక్ట్ ను ఆపేసారు. తాజాగా ఈ చిత్రాన్ని మ‌ళ్లీ తిరిగి ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. అయితే ద‌ర్శ‌కుడు మాత్రం మారుతున్నాడు. హ‌న్స‌ల్ మెహ‌తా స్థానంలో `చ‌క్ దే ఇండియా` డైరెక్ట‌ర్ ష‌మీత్ అమీన్ ఆ బాధ్య త‌లు తీసుకుంటున్నాడు. కొన్ని రోజులుగా ఈప్రాజెక్ట్ గురించి ష‌మీత్-ఆర్య‌న్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగు తున్నాయి.

చివ‌రిగా ఆ చ‌ర్చ‌లు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది ప్ర‌ధ మార్ధంలో చిత్రాన్ని ప‌ట్టాలె క్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే అధికారికంగా ప్రాజెక్ట్ వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ష‌మీత్ అమీన్ కొంత కాలంగా డైరెక్ష‌న్ దూరంగా ఉన్నాడు. 2020 నుంచి సినిమాలు తెర‌కెక్కించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఐదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్క‌డం విశేషం. డైరెక్ట‌ర్ గా అమీత్ కెరీర్ ప్రారంభ‌మై రెండు ద‌శాబ్ద‌లైనా చేసిన సినిమాలు చాలా త‌క్కువే. మూడు సినిమాలే తెర‌కెక్కించారు. మ‌రికొన్ని సినిమాల‌కు వివిధ విభాగాల్లో ప‌ని చేసారు.

కానీ `చక్ దే ఇండియా` సినిమాతో డైరెక్ట‌ర్ గా ప్ర‌త్యేక స్థానం సంపాదించాడు . ఆ విజ‌యంతో దేశ వ్యాప్తంగా అమీత్ పేరు మారుమ్రోగిపోయింది. 20 కోట్ల బ‌డ్జెట్ లోనే తెర‌కెక్కించిన సినిమా 109 కోట్ల వ‌సూళ్ల‌ను రాబట్టింది. కానీ ఆ త‌ర్వాత అదే స‌క్సెస్ ని కొన‌సాగించ‌లేదు. డైరెక్ట‌ర్ గానూ సీరియ‌స్ గా సినిమాలు చేయ లేదు. 2020 లో `ఏ సూట‌బుల్ బోయ్` టీవీ సిరీస్ ని తెర‌కెక్కించాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ మ‌రో సినిమా చేయ‌లేదు.

Tags:    
  • KartikAaryan 
  • CaptainIndia 
  • ShimitAmin 
  • BollywoodNews 
  • ChakDeIndiaDirector 
  • BollywoodUpdates 
  • FilmRevival 
  • HansalMehta 
  • కార్తీక్ ఆర్యన్ 
  • కెప్టెన్ ఇండియా 
  • షమీత్ అమీన్ 
  • హన్సల్ మెహతా 

Similar News

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

Copyright @2026

Powered by Blink CMS