టైటిల్ కష్టాలు... కోర్ట్‌ చెప్పే వరకు తెచ్చుకోవాలా?

ఈ మధ్య కాలంలో సినిమాలను తీయడం ఒక ఎత్తు అయితే వాటిని ప్రమోట్‌ చేసుకోవడం మరో ఎత్తు అవుతుంది;

Update: 2025-10-29 07:10 GMT

ఈ మధ్య కాలంలో సినిమాలను తీయడం ఒక ఎత్తు అయితే వాటిని ప్రమోట్‌ చేసుకోవడం మరో ఎత్తు అవుతుంది. ఎంత కష్టపడి సినిమాలను తీశారో అంతకు మించి కష్టపడి సినిమాలను ప్రమోట్‌ చేయాల్సి వస్తుంది. సినిమాల ప్రమోషన్‌లో టైటిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి అనడంలో సందేహం లేదు. అందుకే కథకు తగ్గట్లుగా కాకుండా చాలా వరకు క్యాచీ టైటిల్స్‌ను, పబ్లిసిటీలో బాగా హెల్ప్‌ అయ్యే ట్రెండీ టైటిల్స్‌ను ఫిల్మ్ మేకర్స్ ఎంపిక చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలో కొన్ని టైటిల్స్ వివాదాన్ని మూట కట్టుకుంటూ ఉంటే, కొన్ని టైటిల్స్‌ సినిమాకు హెల్ప్‌ అవుతున్నాయి. కొన్ని సినిమాలకు పూర్తిగా టైటిల్‌ వల్లే పబ్లిసిటీ దక్కుతుంది. అందుకే చాలా ఆలోచించి, కథకు సంబంధం ఉన్నా లేకున్నా అన్నట్లుగా కొందరు టైటిల్స్‌ను ఎంపిక చేయడం జరుగుతుంది.

బ్రో కోడ్‌ కి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్ట్‌

ఇటీవల తమిళ హీరో రవి మోహన్‌ సినిమా టైటిల్‌ వివాదాన్ని ఎదుర్కొంటుంది. ఏకంగా ఢిల్లీ హై కోర్ట్‌ చిత్ర యూనిట్‌ సభ్యులకు షాక్‌ ఇస్తూ అలాంటి టైటిల్‌ను ఎలా పెడుతారు అంటూ చివాట్లు పెట్టినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రవి మోహన్‌ స్టూడియోస్ బ్యానర్‌ పై రూపొందుతున్న సినిమాకు 'బ్రో కోడ్‌' అనే టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేశారు. ఆ టైటిల్‌ తో ఒక పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది. అయితే బ్రో కోడ్‌ అనేది ఒక ఆల్కహాల్‌ బ్రాండ్‌కు సంబంధించిన పేరు. ఆ పేరును సదరు కంపెనీ ట్రేడ్‌ మార్క్‌ సొంతం చేసుకుంది. చాలా కాలంగా ఆ ట్రేడ్‌ మార్క్‌ తో కంపెనీ కొనసాగుతున్న కారణంగా వెంటనే టైటిల్‌ను తొలగించాల్సిందే అంటూ సదరు కంపెనీ నుంచి లీగల్‌ నోటీసులు ఇవ్వడం జరిగింది. కోర్ట్‌ వరకు వెళ్లిన ఈ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చిందని కోలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

కోలీవుడ్‌ మూవీ టైటిల్‌ వివాదం..

బ్రో కోడ్‌ సినిమా యూనిట్‌ సభ్యులు వెంటనే ఆ టైటిల్‌ను తొలగించాలని కోర్ట్‌ తీర్పు ఇచ్చింది. ఇండోస్పిరిట్‌ బేవరేజెస్‌ సంస్థ నుంచి వచ్చే బ్రో కోడ్‌ ఆల్కహాల్ బ్రాండ్‌ను దెబ్బ తీసే విధంగా ఈ సినిమా ఉంటుందేమో అని అనుమానం వ్యక్తం చేయడంతో పాటు, సదరు కంపెనీ ఇన్నాళ్లుగా ఏర్పరచుకున్న వినియోగదారుల విశ్వాసం సైతం సినిమా ఆ టైటిల్‌తో వస్తే దెబ్బ తింటుందని కంపెనీ వర్గాల వారు కోర్ట్‌ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. టైటిల్‌ మాత్రమే కాకుండా సినిమాలోనూ తమ కంపెనీకి సంబంధించిన పేరును వినియోగించొద్దు అంటూ కంపెనీ కోర్ట్‌ నుంచి ఆర్డర్‌ తీసుకు వచ్చిన నేపథ్యంలో మొత్తం మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం వచ్చింది. సినిమాలో కనీసం ఆ మందు పేరును కూడా కనిపించకుండా చేయాల్సిందే అని కోర్ట్‌ నుంచి ఆర్డర్‌ రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.

కార్తీక్ యోగి దర్శకత్వంలో సినిమా...

ఇండియాలో ఉన్న ట్రేడ్ మార్క్‌ చట్టం ప్రకారం బ్రో కోడ్‌ ను సినిమా టైటిల్‌ గా వారి అనుమతి లేకుండా తీసుకోకూడదు అని కోర్ట్‌ వెళ్లడించింది. కార్తీక్‌ యోగి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు బ్రో కోడ్‌ కాకుండా త్వరలోనే కొత్త టైటిల్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో ఆ పదం వినియోగించిన చోట మరో పదం ను జోడించే అవకాశాలు కూడా ఉన్నాయి. రవి మోహన్‌ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య, అర్జున్ అశోకన్‌, ఉపేంద్ర, గౌరి ప్రియా, శ్రద్దా శ్రీనాథ్‌, మాళవికి మనోజ్‌ ఇంకా ఐశ్వర్య రాజ్‌ లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. 2026 ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. టైటిల్‌ వివాదం కారణంగా సినిమా విడుదల తేదీ విషయంలో మేకర్స్ కొత్త ప్రకటన చేయాల్సి ఉంది.

Tags:    

Similar News