2027 లో ముహూర్తం ఫిక్స్ చేసారా?

అయినా పార్ట్ 2 తీసే ధైర్యం చేస్తారా? అన్న సందేహాలు మాత్రం ఆగ‌లేదు. కాల క్ర‌మంలో యూనిట్ ధీమా చూసి పార్ట్ 2 ఉంటుంన‌ది అంతా ఓ అంచ‌నాకి వ‌చ్చారు.

Update: 2026-08-29 19:30 GMT

బాలీవుడ్ స్టార్ ర‌ణ‌బీర్ కపూర్, అలియాభ‌ట్ జంట‌గా అయాన్ ముఖర్జీ తెర‌కెక్కించిన విజువల్ వండర్ `బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ - శివ` డివైడ్ టాక్ బ‌య‌టప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలోనే రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అయితే మొద‌టి భాగం టాక్ త‌ర్వాత రెండ‌వ భాగం ఉండ‌ద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయినా ఆ ప్ర‌చారాన్ని యూనిట్ ఎప్ప‌టిక‌ప్పుడు కొట్టి పారేసింది. అయినా పార్ట్ 2 తీసే ధైర్యం చేస్తారా? అన్న సందేహాలు మాత్రం ఆగ‌లేదు. కాల క్ర‌మంలో యూనిట్ ధీమా చూసి పార్ట్ 2 ఉంటుంన‌ది అంతా ఓ అంచ‌నాకి వ‌చ్చారు.

తాజాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే సమయం గురించి ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం `బ్రహ్మాస్త్ర 2` చిత్రాన్ని 2027 ఏప్రిల్ నుంచి పట్టాలెక్కించడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. మొదటి భాగం ముగింపులోనే రెండవ భాగానికి సంబంధించిన దేవ్ పాత్రను పరిచయం చేస్తూ అయాన్ ముఖర్జీ క్యూరియాసిటీని పెంచారు. దాంతో ఈ సీక్వెల్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సుదీర్ఘ ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్లాన్ చేసింది.

ఆలస్యానికి ప్రధాన కారణం ర‌ణ‌బీర్ కపూర్ మిగతా భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటమే. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రామాయణ` షూటింగ్‌ను ర‌ణ‌బీర్ త్వరలోనే పూర్తి చేయనున్నారు. సోర్సెస్ ద్వారా తెలిసిందేంటంటే? వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నాటికి ర‌ణ‌బీర్ రామాయ‌ణం నుంచి పూర్తి గా రిలీవ్ అవుతార‌ని అంటున్నారు. అనంత‌రం రెండు..మూడు నెల‌ల గ్యాప్ అనంత‌రం `బ్రహ్మ‌స్త్ర 2` లో ర‌ణ‌బీర్ జాయిన్ అవుతారు. అయితే ఈ సీక్వెల్లో అనేక ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

మొదటి భాగంలో ఈషాగా మెప్పించిన అలియా భట్, రెండవ భాగంలో అతిథి పాత్ర కే పరిమితం కానుందని టాక్. రణ్బీర్ కపూర్ ఈ చిత్రంలో దేవ్ -శివగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. పవర్‌ఫుల్ అమృత పాత్ర కోసం సౌత్ నుంచి ఒక టాప్ హీరోయిన్‌ను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట‌. నిర్మాణ పరంగా కూడా మేకర్స్ భారీ ప్లాన్లే వేశారు. విజువల్ వండర్‌ను గ్లోబల్ రేంజ్‌లో నిలబెట్టేందుకు `రామాయణ` నిర్మాత ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రను ప్రాజెక్ట్‌లో ప్రధాన భాగస్వామిగా తీసుకొచ్చారు. గ్రాఫిక్స్ .. విఎఫ్ ఎక్స్ ఆధారిత చిత్రాలకు నమిత్ మల్హోత్రా తోడవటం వల్ల సాంకేతిక ప్రమాణాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబో తున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News