నడుము సోయగాలతో గిలిగింతలు పెడుతున్న శ్రద్ధాదాస్!

సందర్భం ఏదైనా సరే ట్రెండ్ కి తగ్గట్టుగా రెడీ అవుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో శ్రద్ధా దాసు మొదటి స్థానంలో ఉంటుంది.

Update: 2026-08-29 14:14 GMT

సందర్భం ఏదైనా సరే ట్రెండ్ కి తగ్గట్టుగా రెడీ అవుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో శ్రద్ధా దాసు మొదటి స్థానంలో ఉంటుంది.అందం, అభినయంతో నటనతో ఆకట్టుకుంటూ గ్లామర్ తో కుర్రకారును కట్టిపడేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే తాజాగా రాఖీ సెలబ్రేషన్స్ లో భాగంగా చీరకట్టులో కనిపించే అభిమానులను మెస్మరైజ్ చేసింది.




 


నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే శ్రద్ధాదాస్ తాజాగా మరో లేటెస్ట్ అవుట్ ఫిట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. శారీ సీజన్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈమె డీప్ వీ నెక్ కలిగిన స్లీవ్ లెస్ ప్లెయిన్ బ్లౌజ్ ధరించింది. దీనికి కాంబినేషన్ లో సింపుల్ డిజైన్ తో బ్లాక్ మెరూన్ లైట్ క్రీం కలర్ మిక్స్ లలో డిజైన్ చేసిన శారీ ధరించింది. ఇక ఈ శారీతో తన అందాన్ని రెట్టింపు చేసుకుంది శ్రద్ధా దాస్. నడుము వయ్యారాలతో ఫోటోలకు ఫోజులిచ్చిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.




 


తాజాగా శ్రద్ధా దాసు తన సోదరుడికి రాఖీ కట్టి మరీ రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకుంది. మొత్తానికి అయితే ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు రెడ్ ఫైర్ ఎమోజీలతో పాటు లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.




 


శ్రద్ధా దాస్ కెరియర్ విషయానికి వస్తే.. 1987 మార్చి 4న మహారాష్ట్ర ముంబైలో జన్మించింది. ఈమె తండ్రి వ్యాపారవేత్త కాగా తల్లి గృహిణి వీరు పురూలియా నుండి ముంబై వచ్చి అక్కడే సెటిల్ అయ్యారు. ముంబైలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. అలా ముంబై విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో డిగ్రీ పట్టా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.




 


ఆర్య 2 చిత్రంతో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రద్ధాదాస్ అధినేత, టార్గెట్, సిద్దు ఫ్రం శ్రీకాకుళం ,గుంటూరు టాకీస్, నాగవల్లి, మరోచరిత్ర, మొగుడు, ఏక్ మినీ కథ, నిరీక్షణ, పారిజాత పర్వం ఇలా ఎన్నో చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. త్రికాల అనే సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Tags:    

Similar News