సాయికుమార్-ఆదితో 'బొమ్మ‌రిల్లు 2' తీయాలి: దిల్ రాజు

ప్ర‌కాష్ రాజ్- సిద్ధార్థ్ తండ్రి కొడుకులుగా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా, భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన `బొమ్మ‌రిల్లు` టాలీవుడ్ క్లాసిక్ హిట్స్ లో ఒక‌టిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-01-07 04:05 GMT

ప్ర‌కాష్ రాజ్- సిద్ధార్థ్ తండ్రి కొడుకులుగా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా, భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన `బొమ్మ‌రిల్లు` టాలీవుడ్ క్లాసిక్ హిట్స్ లో ఒక‌టిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సిద్దార్థ్ గాళ్ ఫ్రెండ్ పాత్ర‌లో అల్ల‌రి హాసినిగా జెనీలియా అద్భుత న‌ట‌న‌ను ప్రేక్ష‌కులు మ‌ర్చిపోలేరు. తెలుగు సినిమా హిస్ట‌రీలో ఇది ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ సినిమా క‌థ‌, క‌థ‌నం, న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌, మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల్లో మ్యాజిక్ చేసింది. అయితే చాలా కాలంగా బొమ్మ‌రిల్లు సీక్వెల్ తీయాల‌ని ప్రేక్ష‌కాభిమానులు కోరుకుంటున్నా అది సాధ్య‌ప‌డ‌టం లేదు.

ఇప్పుడు యాథృచ్ఛికంగా అయినా కానీ దిల్ రాజు నోట `బొమ్మ‌రిల్లు 2` మాట ప‌లికారు. ఆది సాయికుమార్ న‌టించిన `శంబాల` స‌క్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ... వేదిక‌పై ఉన్న తండ్రి కొడుకులు సాయికుమార్ - ఆదిని ఉద్ధేశించి మాట్లాడుతూ.. ఒక‌వేళ `బొమ్మ‌రిల్లు 2` తీయాల్సి వ‌స్తే, సాయికుమార్ - ఆది వాళ్ల స్టోరీ పెట్టి తీయాల‌ని దిల్ రాజు వ్యాఖ్యానించారు. త‌న‌యుడి స‌క్సెస్ కోసం త‌పించే తండ్రిగా సాయికుమార్ త‌ప‌న‌ను చూస్తుంటే త‌న‌కు ఈ ఆలోచ‌న వ‌చ్చింద‌ని కూడా వెల్ల‌డించారు. కొడుకు స‌క్సెస్ కోసం బ్యాక్ బోన్ గా నిల‌బ‌డి ఆయ‌న ప‌ని చేసారు. కేవ‌లం త‌న‌యుడికే కాదు చిత్ర‌బృందం అంద‌రికీ వెన్నెముక‌లా నిల‌బ‌డ్డార‌ని సాయికుమార్ పై దిల్ రాజు ప్ర‌శంస‌లు కురిపించారు.

సాధార‌ణంగా ఇండ‌స్ట్రీలో అంద‌రితో బాగా ఉండ‌టం కుద‌ర‌దు. కానీ సాయికుమార్ అంద‌రివాడు. అంద‌రితో బాగా ఉంటాడు. అది అత‌డికే కుదిరింద‌ని కూడా దిల్ రాజు ప్ర‌శంసించారు. బొమ్మ‌రిల్లు 30 ఏళ్ల క్రితం తెర‌కెక్కిన‌ప్పుడు నిజంగా బొమ్మ‌రిల్లు తండ్రిని చూపించ‌డం చాలా కుటుంబాల‌లో మార్పులు తీసుకువ‌చ్చింద‌ని త‌న‌తో అన్నట్టు కూడా దిల్ రాజు ఈ వేదిక‌పై వెల్ల‌డించారు.

అయితే దిల్ రాజు త‌న ప్రామిస్ ని నిలబెడుతూ సాయికుమార్ - ఆదితో బొమ్మ‌రిల్లు సీక్వెల్ తెర‌కెక్కించాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆదికి దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత శంబాల రూపంలో వ‌చ్చిన స‌క్సెస్ ని చూసి సాయికుమార్ నిజంగానే చాలా ఎమోష‌న‌ల్ గా ఉన్నారు. ఆది - సాయికుమార్ కుటుంబం ఎంతో ఎగ్జ‌యిట్ మెంట్ తో కూడుకున్న ఎమోష‌న్ తో క‌నిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత అంద‌రివాడు అయిన సాయికుమార్ వార‌సుడు ఆదికి మ‌రో పెద్ద అవ‌కాశం క‌ల్పించాల‌ని కూడా కోరుకుంటున్నారు. బ‌హుశా అది బొమ్మ‌రిల్లు 2 అయితే ఇంకా బావుంటుంది.

Tags:    

Similar News