'క‌ల్కి'..'పుష్ప‌-2' కోసం అక్క‌డ వెయిటింగ్!

ఎందుకంటే ఈనెల‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి.

Update: 2024-05-08 05:43 GMT

'యానిమ‌ల్' త‌ర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసి సినిమా ఏది అవుతుంద‌ని ఎదురు చూస్తుంది. కానీ ఐదు నెల‌లు గ‌డుస్తున్నా? ఇంత‌వ‌ర‌కూ అందులో సగం సౌండింగ్ కూడా వినిపించ‌లేదు. అందులోనూ ఏప్రిల్ రిలీజ్ లు మ‌రింత పేవ‌లంగా క‌నిపిస్తున్నాయి. 2024 అత్యంత వృద్ధా నెల‌గా ఏప్రిల్ ని నిలిచిపోయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఈనెల‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అవి మంచి వ‌సూళ్లు సాధిస్తాయ‌ని ట్రేడ్ సైతం అంచ‌నా వేసింది. కానీ ఫ‌లితాలు అందుకు భిన్నంగా క‌నిపిస్తున్నాయి. 'బడే మియాన్ చోటే మియాన్', 'మైదాన్', 'LSD 2', 'దో ఔర్ దో ప్యార్', 'రుస్లాన్‌' అన్ని ఏప్రిల్ రిలీజ్ లే. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. 'మైదాన్' కి మంచి టాక్ రావ‌డంతో క‌నీసం వంద కొట్టైనా తెస్తుంద‌ని భావించారు. కానీ ఆ సినిమా 60 కోట్ల వ‌ద్దే ఆగిపోయింది. ఇక మిగ‌తా సినిమా వ‌సూళ్లు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దీంతో ఆ సినిమాలు కొనుగోలు చేసిన ఎగ్జిబిట‌ర్లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ల‌పై ఆర్ధిక ఒత్తిడికి దారి తీసిన‌ట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలు క‌నీసం యావ‌రేజ్ గా ఆడినా కొంత వ‌ర‌కూ ఆ ఒత్తిడి ఉండేది కాదు. కానీ తాజా స‌న్నివేశంలో మ‌రింత ట‌ఫ్ సిచ్వేష‌న్ క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతందేశంలో ఎన్నిక‌ల స‌మ‌యం. దీంతో చాలా రిలీజ్ లు వాయిదా ప‌డ్డాయి. అవి రిలీజ్ అయ్యే వ‌ర‌కూ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల ప‌రిస్థితి మ‌రింత అద్వానంగా ఉంటుంద‌ని చెప్పొచ్చు. ఇప్ప‌టికే థియేట‌ర్ల వ‌ద్ద ఆ ర‌క‌మైన స‌న్నివేశం క‌నిపిస్తుంది. ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా చాలామంది ప్రదర్శనలను తగ్గించి, టిక్కెట్ ధరలను తగ్గించవలసి వచ్చింది. రోజుకి నాలుగు షోల‌కు బ‌ధులు రెండు షోలు తక్కువ టికెట్ ధ‌ర‌తో వేయాల్సి వ‌స్తోంది.

Read more!

ఈ ఏడాది పూర్తిగా గ‌త ఏడాదికి భిన్నంగా క‌నిపిస్తుంది. 2023 లో షారుఖ్ ఖాన్ చిత్రాలు 'పఠాన్' - 'జవాన్‌'లతో థియేట్రికల్ బిజినెస్ ని మ‌ళ్లీ వృద్దిలోకి తీసుకురాగా..ఇప్ప‌టి వ‌ర‌కూ రిలీజ్ అయిన ఈ ఏడాది సినిమాలు అంత‌కంత‌కు కింద‌కు లాగుతున్నాయి. దీంతో బాలీవుడ్ మ‌రోసారి తెలుగు సినిమాల‌పై ఆధార‌ప‌డాల్సిన స‌న్నివేశం క‌నిపిస్తుంది. ఇప్ప‌ట్లో హిందీ నుంచి అగ్ర హీరోల సినిమాలేవి రిలీజ్ కి లేవు. దీంతో 'క‌ల్కి 2898'..'పుష్ప‌-2' లాంటి చిత్రాల‌తోనే బాలీవుడ్ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడే సూచ‌న‌లున్నాయి. ఈ రెండు సినిమాల‌కు అక్క‌డ మంచి ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని అంచనాలున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News