టాలీవుడ్ పై బాలీవుడ్ రాజనాల వేషాలు!
తాజాగా తెలుగు సంచలనం సందీప్ రెడ్డి వంగా వివాదం విషయంలో ఒక్కసారి గతంలో కి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది.;
అమితాబచ్చన్ , అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్లను పక్కనబెట్టి చూస్తే? టాలీవుడ్ పై విషం చిమ్మేవారెంతో మంది. ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీగా టాలీవుడ్ ఎదగడం... గ్లోబల్ స్థాయిలో టాలీవు డ్ ఇంపాక్ట్ పడటాన్ని బాలీవుడ్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుందన్నది కాదనలేని నిజం. బాలీ వుడ్ చర్యలతోనే ఈ విషయం క్లియర్ గా అర్దమవుతోంది. దేశానికి తెలుగు పరిశ్రమ తరుపు ఆస్కార్ వరించి నప్పు డు బాలీవుడ్ నుంచి ఎలాంటి ప్రశంస దక్కలేదు.
అక్కడ నిర్మాణ సంస్థలు గానీ, అగ్ర నిర్మాతలు గానీ ఎవరూ కనీసం ట్వీట్ కూడా వేయలేదు. అమీర్ ఖాన్, అబితాబచ్చన్ లాంటి లెజెండ్స్ తప్ప ఇంకెవ్వరూ స్పందించలేదు. బాలీవుడ్ పనితనాన్ని...టాలీవుడ్ పనితనాన్నిఅమితాబ్, సల్మాన్ ఖాన్, అమీర్ లాంటి వారు ఎంతో గొప్పగా పోలిక చేసారు. తెలుగు పరిశ్ర మను చూసి మన వాళ్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నర్మగర్భంగా చెప్పారు.
ఇదంతా ఒక వెర్షన్ అయితే? టాలీవుడ్ ప్రతిభను సైతం తొక్కే ప్రయత్నాలు బాలీవుడ్ నిసిగ్గుగా చేస్తోంది అన్నది అంతే వాస్తవం. ఏదో రూపంలో ప్రతిభను కించపరిచేలా కొంత మంది వ్యక్తులు స్పందిస్తున్న తీరును బట్టి అర్దమవుతోంది. తాజాగా తెలుగు సంచలనం సందీప్ రెడ్డి వంగా వివాదం విషయంలో ఒక్కసారి గతంలో కి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. బాలీవుడ్ ఇండస్ట్రీ సందీప్ పై డర్టీ పీఆర్ గేమ్స్ ని తెరపైకి తేవడంతో? మరోసారి బాలీవుడ్ అక్కసు...అసూయ బయట పడింది.
'కబీర్ సింగ్', 'యానిమల్' విజయాలతో బాలీవుడ్ లో సందీప్ సంచలన డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో అతడి ఎదుగదల పై బాలీవుడ్ కుళ్లు కుంటుంది. కుతంత్రాలు చేస్తోంది. ఎలాగైనా ఎదగకూడదని బాలీవుడ్ లో ఓ సెక్షన్ పనిగట్టుకుని అతడిపై రాజనాల వేషాలు వేస్తోంది. ఇలా తెలుగు ప్రతిభావంతులపై కుతంత్రాలు చేయడం కొత్తేం కాదు. ఇలాంటి వాటిని దర్శక శిఖరం రాజమౌళి సైతం ఎదుర్కున్నవారే.
'మగధీర' , 'ఈగ', 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్' లాంటి సినిమాలతో ప్రపంచమే ఆయన వైపు చూసింది. కానీ బాలీవుడ్ మాత్రం శ్రీదేవి రూపంలో ఎగతాళి చేసే ప్రయత్నం చేసింది. శివగామి పాత్రకు శ్రీదేవి ని అనుకుంటే? మీ అర్హతలేంటి? అన్నట్లు మాట్లాడిందని అప్పట్లో వైరల్ అయింది. తాను సినిమాలో నటించాలంటే అధిక పారితోషికం డిమాండ్ చేసింది. ఇది గాక తన స్టాప్ కు సంబంధించి ఎన్నో గొంతె మ్మ కోర్కెలు కోరింది.
దీంతో అదే పాత్రకు రమ్యకృష్ణను తీసుకుని సంచలన హిట్ కొట్టాడు. అదే పాత్ర శ్రీదేవి చేస్తే అట్టర్ ప్లాప్ అయ్యేదనే అంశం తెరపైకి వచ్చింది. దీంతో బోనీ కపూర్ సీరియస్ అయ్యారు. ఈ సమయంలో రాజమౌ ళికి వ్యతిరేకంగా...శ్రీదేవి అనుకూలంగా బాలీవుడ్ మీడియాలో ఎన్నో కథనాలొచ్చాయి. 'మణికర్ణిక' విషయంలో క్రిష్ కూడా ఇలా బలైన డైరెక్టరే. కంగనా రనౌత్ తో సగం సినిమా పూర్తి చేసి దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకోవడంతో ఆ క్రెడిట్ అంతా తనదేనని కంగన ప్రొజెక్ట్ చేసుకుంది.
కొంత భాగానికి దర్శకత్వం వహించి క్రిష్ పేరును హైడ్ చేసే ప్రయత్నం చేసింది. ఈ విషయంలో సోను సూద్, రైటర్ అపూర్వ అస్రాణి, మిస్తీ చక్రవర్తి లాంటి వారు క్రిష్ కి మద్దతిచ్చారు అప్పట్లో. కానీ ప్రచార సమయంలో క్రిష్ ని కార్నర్ చేసి తప్పంతా అతడితే అన్నట్లు ప్రొజెక్ట్ చేసింది. మరో తెలుగు తేజం ప్రశాంత్ వర్మను కూడా అలాగే అవమానించారు.
రణ్ వీర్ సింగ్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శక త్వంలో 'బ్రహ్మరాక్షస' ప్రారంభించారు. ఒక రోజు షూటింగ్ కూడా చేసారు. కానీ అదే రోజు క్రియేటివ్ డిఫరెన్సెస్ పేరుతో ప్రాజెక్ట్ ఆపేసారు. అక్కడ తప్పంతా ప్రశాంత్ వర్మదే అన్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు అల్లింది. ఇప్పుడేమో సందీప్ రెడ్డి వంగా స్టోరీను దీపికా పదుకొణే లీక్ చేసి అతడినే తప్పు బట్టే ప్రయత్నం చేస్తోంది.