AI Vs సినిమా.. చావడం లేదు చంపేస్తున్నారు..
బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తాజాగా బాలీవుడ్ పరిశ్రమపై సంచలన పోస్ట్ చేశారు.;
బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తాజాగా బాలీవుడ్ పరిశ్రమపై సంచలన పోస్ట్ చేశారు. బాలీవుడ్ పరిశ్రమ సమిష్టి వైఫల్యాన్ని ప్రతిబింబించేలా ఆయన చేసిన పోస్ట్ బీటౌన్ లో సంచలనం సృష్టిస్తుంది.. వివేక్ అగ్నిహోత్రి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టాడు.. AIజనరేటర్ ఆర్ట్ యొక్క కారౌ సెల్ పోస్టుని ఈ విధంగా పంచుకున్నారు. AI క్రియేటివ్ టెంప్లేట్ గత యుగం నుండి వచ్చిన సినిమా పోస్టర్..బాలీవుడ్ ఇండస్ట్రీని చంపిన దాని గురించి మాట్లాడారు. ఆ పోస్టులో.. "బాలీవుడ్ ని ఎవరు చంపుతున్నారు? సినిమా చనిపోవడం లేదు..అది హత్య చేయబడుతోంది.. తారాగణం చెల్లింపు,పి ఆర్, ఛాయ చిత్రకారులు, స్పాటింగ్, నృత్యాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్ లు అన్నీ కలిసి సినిమాను చంపేస్తున్నాయి" అని ఓ పోస్ట్ పెట్టాడు.
ఆ తర్వాత.. ఏఐ అందించే సాంకేతికతను బాలీవుడ్ ఎలా నిర్వహిస్తుందో ఈ విధంగా చెప్పాడు.స్టూడియోలు AI జనరేటెడ్.. రామాయణ,మహాభారత అన్ని సినిమాలను పరీక్షిస్తున్నాయి. టీనేజర్లు AI ఫిల్మ్ ఫెస్టివల్స్ ను నిర్వహిస్తున్నారు.
ఇక మరో పోస్ట్ లో బాలీవుడ్ తారలు నకిలీ బాక్సాఫీస్ నెంబర్లను పోస్ట్ చేయడం.. విమానాశ్రయ ర్యాంప్ లపై నడవడం, పెయిడ్ అవార్డ్స్ ఇచ్చే ప్రదర్శనలో నృత్యం చేయడంలో బిజీగా ఉండే పోస్ట్ ని షేర్ చేశారు.
అలాగే ఇంకో పోస్టులో హాలీవుడ్.. బాలీవుడ్ తో పోలిస్తే ఏ ఏ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొందో ఆయన విభిన్నంగా వివరించారు. హాలీవుడ్ రచయితలు దీన్ని ఎదుర్కొన్నప్పుడు ఊహను కాపాడుకోవడానికి వారు 148 రోజులు సమ్మె చేశారు. మరి బాలీవుడ్లో..? ఇక్కడ గిల్టులు లేవు, ఆగ్రహం లేదు,చర్చ లేదు చింత లేదు అని అర్థం వచ్చే పోస్ట్ పెట్టాడు.
మరో పోస్టులో.. సినిమా చనిపోవడం లేదు.అది హత్య చేయబడుతోంది. పి ఆర్ మరియు సెల్ఫీల ద్వారా సినిమా సాఫ్ట్ పవర్ గా ఉండగలదా..? భారతదేశం ప్రపంచాన్ని నడిపించాలనుకుంటుంది.కానీ ఊహలో న్యాయకత్వం వహించకుండా ఏ దేశము నాయకత్వం వహించాలి అనుకుంటుంది. అందరు కళాకారులను భర్తీ చేయరు. అది సోమరితనాన్ని భర్తీ చేయదు..అసలు ప్రశ్న ఏంటంటే.. సినిమా మనుగడ సాగిస్తుందా.? కాదు అది మనం ఇంకా కలలు కనడం గుర్తుందా?మన కలల కోసం ఎలా పోరాడాలి..అంటూ బాలీవుడ్ ను ఎవరు చంపుతున్నారు అనే శీర్షిక పెట్టి ఈ విధంగా సోషల్ మీడియా నెటిజన్స్ అభిప్రాయాలు ఎలా ఉంటాయని తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని పోస్టులు చేశారు..
అయితే చాలా రోజుల నుండి బాలీవుడ్ లో ఏఐ గురించి చర్చ ఎన్నో రకాలుగా జరుగుతుంది.కానీ పరిశ్రమ దీని గురించి చాలా ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చివరిగా ది బెంగాల్ ఫైల్స్ అనే మూవీతో మన ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.