కోల్పోయిన స్థానం కోసం ప‌రిశ్ర‌మ పాకులాట‌!

ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ నెంబ‌ర్ వ‌న్ అంటే బాలీవుడ్ పేరు మాత్ర‌మే వినిపించేది. అక్క‌డ సినిమాల స‌క్సెస్ రేట్.. బ‌డ్జెట్..హీరోల పారితోషికాల తో హిందీ ప‌రిశ్ర‌మ‌ టాప్ లో క‌నిపించేది.;

Update: 2026-01-22 04:32 GMT

ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ నెంబ‌ర్ వ‌న్ అంటే బాలీవుడ్ పేరు మాత్ర‌మే వినిపించేది. అక్క‌డ సినిమాల స‌క్సెస్ రేట్.. బ‌డ్జెట్..హీరోల పారితోషికాల తో హిందీ ప‌రిశ్ర‌మ‌ టాప్ లో క‌నిపించేది. దక్షిణాది ప‌రిశ్ర‌మ‌లు ఏమాత్రం పోటీలో కూడా ఉండేవి కాదు. దేశ‌మంతా హిందీ ప‌రిశ్ర‌మ పేరే వినిపించేది. కానీ ఇప్పుడా స‌న్నివేశం అందుకు భిన్నంగా ఉంది. కొంత కాలంగా సౌత్ సినిమాల‌దే హ‌వా. ప్ర‌త్యేకించి తెలుగు ఇండ‌స్ట్రీ అంటే బాలీవుడ్ గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించే ప‌రిశ్ర‌మ‌గా మారిపోయింది. పాన్ ఇండియాలో తెలుగు సినిమా స‌క్సెస్ రేట్ తోనే ఇది సాధ్య‌మైంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం.

టాలీవుడ్ త‌ర్వాత క‌న్న‌డ ప‌రిశ్ర‌మ బాలీవుడ్ లో స‌త్తా చాటుతోంది. మిగ‌తా ప‌రిశ్ర‌మ‌లు చాప‌కింద నీరులా బాలీవుడ్ లో విస్త‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. దీంతో బాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని కోల్పోయి నెంబ‌ర్ 2గా మారింది. ఆ స్థానం కోసం క‌న్న‌డ ఇండ‌స్ట్రీ పోటీ ప‌డుతోంది. అయితే 2025 ఏడాది మాత్రం బాలీవుడ్ కి చాలా ఊర‌ట‌నిచ్చింది. డిసెంబ‌ర్ లో రిలీజ్ అయిన `ధురంధ‌ర్` సింగిల్ లాంగ్వేజ్లో నే 1300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. బాలీవుడ్ లో బ‌న్నీ పేరిట ఉన్న 800 కోట్ల వ‌సూళ్లు రికార్డును ర‌ణ‌వీర్ సింగ్ `ధురంధ‌ర్` తో బ‌ద్ద‌లుకొట్టాడు.

దీంతో బాలీవుడ్ సంతోషంలో మునిగిపోయింది. మ‌ళ్లీ మ‌న హీరో వ‌చ్చాడంటూ సంబ‌రాలు చేసుకుంటోంది. `పుష్ప 2` తో బ‌న్నీ బాలీవుడ్ హీరోల రికార్డుల‌న్నింటిని ప‌క్క‌కు నెట్ట‌డంతో? బాలీవుడ్ ఆ రికార్డు చేధించాల‌ని అప్ప‌టి నుంచి క‌స‌తో ర‌గిలిపోయింది. ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసారు గానీ ప‌న‌వ్వ‌లేదు. చివ‌రిగా `ధురంధ‌ర్` తో అది సాధ్య‌మైంది. తాజాగా కోల్పోయిన నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని తిరిగి ద‌క్కించుకోవ‌డం కోసం సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అదృష్టం క‌లిసొస్తే ఈ స‌మ్మ‌ర‌లోనే సాధించే అవ‌కాశాలైతే ఉన్నాయి.

మార్చిలో భారీ అంచ‌నాల మ‌ధ్య `ధురంధ‌ర్ 2` రిలీజ్ అవుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ 2000 కోట్లు. అలాగే షారుక్ ఖాన్ న‌టిస్తోన్న `కింగ్` కూడా స‌మ్మ‌ర్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా టార్గెట్ కూడా 1500 కోట్ల వ‌ర‌కూ ఉంది. ఇప్ప‌టికే షారుక్ ఖాన్ 1000 కోట్ల క్ల‌బ్ లో చేరిన స్టార్ గా గుర్తింపు ఉంది. అలాగే 30 ఏళ్ల క్రితం నాటి `బోర్డ‌ర్` కి సీక్వెల్ గా `బోర్డర్ 2`ని తెరకెక్కించారు. జ‌న‌వ‌రి 23న ఈ చిత్రం భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ 500 కోట్ల‌గా ఉంది. అలాగే షాహిద్ క‌పూర్ `ఓ రోమియో` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. షాహిద్ రొమాంటిక్ స్టోరీలకు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి స‌క్సెస్ రేట్ ఉంది. ఈ నేప‌థ్యంలో ఓ రోమియో కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి నెబ‌ర్లు సాధిస్తుంద‌ని అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. ఈ సినిమాల‌న్నీ గ‌నుక టార్గెట్ రీచ్ అయితే నెంబ‌ర్ వ‌న్ స్థానం తిరిగి కైవ‌సం చేసుకునే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News