జాన్వీ కపూర్ లేటెస్ట్ లుక్ చూశారా.. అందాలతోనే మాయ చేస్తోందిగా!
ఈమె ప్రొఫెషనల్ కెరియర్ విషయానికి వస్తే.. ఈ ఏడాది పరమ్ సుందరి, హోమ్ బౌండ్, సన్నీ సంస్కరీకి తులసీ కుమారి వంటి సినిమాల్లో అలరించింది.;
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ మధ్యనే సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలోనే ఉంది.కానీ కాంతార: చాప్టర్ 1 మూవీ విడుదల కావడంతో ఈ సినిమా కలెక్షన్లకు గండి పడింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లో కేవలం రూ.32.12 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వసూళ్లు చేసింది. అయితే జాన్వీ కపూర్ సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా అభిమానులతో కూడా టచ్ లో ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు తన అద్భుతమైన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా అభిమానులతో వహ్వా అనిపించుకుంటుంది.
అయితే తాజాగా మరో ఫోటోషూట్ తో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో మల్టీకలర్ మినీ స్కర్ట్ ధరించి.. పైన జెర్కిన్ వేసుకొని.. పైగా కూలింగ్ గ్లాస్ తో తన లుక్ ను ఫుల్ ఫిల్ చేసింది. ఈ లుక్ లో చాలా అందంగా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. జాన్వీ కపూర్ లేటెస్ట్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అటు ఫాలోవర్స్ కూడా చాలా అందంగా ఉంది అంటూ.. క్యూట్ గా ఉంది అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు..
ఈమె ప్రొఫెషనల్ కెరియర్ విషయానికి వస్తే.. ఈ ఏడాది పరమ్ సుందరి, హోమ్ బౌండ్, సన్నీ సంస్కరీకి తులసీ కుమారి వంటి సినిమాల్లో అలరించింది.అయితే ఈ 3 సినిమాల్లో జాన్వీ కపూర్ యాక్టింగ్ బాగున్నప్పటికీ కథ బాలేకపోవడంతో సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో రామ్ చరణ్ తో పెద్ది సినిమాలో నటిస్తోంది. అలాగే నాని ది ప్యారడైజ్ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అలాగే AA22XA6 కూడా గెస్ట్ రోల్ చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో తఖ్త్ మూవీలో నటిస్తోంది.
ఇకపోతే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి డిజాస్టర్ ను మూటగట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మకి ఇంకా బాలీవుడ్ లో అవకాశాలు వస్తుండడంతో నెటిజన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ కపూర్ ఆశలన్నీ కూడా టాలీవుడ్ సినిమాలపైనే ఉన్నాయి. మరి ఏ మేరకు ఈ టాలీవుడ్ చిత్రాలు ఈమెకు సక్సెస్ అందిస్తాయో చూడాలి.
ఇకపోతే జాన్వీ కపూర్ తొలిసారి ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా ద్వారానే తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. అందుకే ఇప్పుడు అమ్మడికి తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. మరి ఈ సినిమాలు ఈమె కెరియర్ కు ఎలా దోహదపడతాయో చూడాలి.